Ugadi 2024 Panchangam: తులా రాశి వారు ఆ పనిచేస్తే.. క్రోధీ నామ సంవత్సరంలో అంత విజయమే!

Ugadi 2024 Panchangam Tula Rasi Phalalu in Telugu: తెలుగు వారి పండుగైన ఉగాదిని ఈ ఏడాది ఏప్రిల్ 9న జరుపుకుంటున్నాం. క్రోధీ నామ సంవత్సరంగా పిలవబోతుంది. క్రోధీ అంటే కోపం, ఆగ్రహం. మరీ ఈ ఏడాది తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?

Ugadi 2024 Panchangam Tula Rasi Phalalu in Telugu: తెలుగు వారి పండుగైన ఉగాదిని ఈ ఏడాది ఏప్రిల్ 9న జరుపుకుంటున్నాం. క్రోధీ నామ సంవత్సరంగా పిలవబోతుంది. క్రోధీ అంటే కోపం, ఆగ్రహం. మరీ ఈ ఏడాది తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటే..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అచ్చమైన తెలుగు పండుగ ఉగాది. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలయ్యేది ఈ పండుగతోనే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకంతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఈ ఫెస్టివల్ తప్పకుండా చేసుకుని తీరుతుంటారు. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాస గాథల ప్రకారం.. మత్య్సావతారం ధరించిన శ్రీ మహా విష్షువు వేదాలకు హాని చేస్తున్న సోమకుని వధించి తిరిగి వాటిని బ్రహ్మకప్పగించిన శుభ తరుణమే ఈ ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలు ఉంటాయి. ఉగాది అనగా..ప్రపంచానికి ఆయుష్సు పోసిన తొలి రోజు కనుకనే ఈ పేరు వచ్చింది.

తెలుగు వారి నూతన ఏడాది ప్రారంభమయ్యే ఉగాది నాడు.. ఇళ్లు శుభ్రం చేసుకుని, స్నాన జపాదులను ఆచరించి ఆ తర్వాత పూజ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ నాడు ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యం పెట్టి.. ఆ తర్వాత ఆరగిస్తుంటారు. చాలా మంది ఈ రోజు మామిడి తిన్నాకనే.. మామిడి పళ్లు తినడం స్టార్ చేస్తుంటారు. ఉగాది నాడు ముఖ్యంగా పంచాగ శ్రవణంతో పాటు రాశి ఫలాలు ఎలా ఉంటాయో గమనిస్తుంటారు. ఈ ఏడాది తమకు ఎలా ఉండబోతుందని, అలాగే దేశ, రాష్ట్ర భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, కరువు, వానలు, వరదలు గురించి జ్యోతిష్య పండితులు చెప్పే పంచాగ శ్రవణాన్ని ఫాలో అవుతుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. క్రోధీ నామసంవత్సరంగా చెప్పబడుతోన్న ఈ ఏడాది తులారాశి వారికి ఎలా ఉంటుందో జ్యోతిష్య పండితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాశి చక్రాల్లో ఏడవది తులారాశి. ఈ రాశిని పురుష రాశిగానూ పరిగణిస్తుంటారు. ఈ రాశికి అధిపతి శుక్రడు. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1,2,3,4 పాదాల, విశాఖ 1,2,3 పాదాలు ఈ తులారాశి వారి కిందకు వస్తారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం- 8గా కనిపిస్తోంది. రాజపూజ్యం-1, అవమానం-5గా ఉంటుందని చెబుతున్నారు. ఈ తులా రాశి వారికి గురు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి కాస్త కష్టకాలంతో పాటు అనుకూల సమయం కూడా గోచరిస్తుందని చెబుతున్నారు పండితులు. ప్రతి పనిలోనూ విఘ్నాలు కలుగుతాయని, అయితే ఓర్పుగా, నేర్పుగా, సమయం వృధా చేయకుండా కృషి చేస్తే ఫలితం దక్కుతుంది.

ఈ ఏడాది తులా రాశివారు ఆదాయంతో పాటు అవరోధాలు అవమానాలు ఎక్కువగా  కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడటం మంచిది. అప్పుల విషయంలో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవ్వరి దగ్గర కొత్త అప్పులు చేయకపోవడమే మేలు. పాత అప్పులు కూడా క్రమ క్రమంగా తీర్చి వేయడం కూడా మంచిది. ఈ ఏడాది నూతన గృహం, నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ప్రయత్నించే వారికే సమస్యలు ఎదురౌతుంటాయి. అవి మీకు లాభదాయకంగా మారే అవకాశాలున్నాయి. ఇక ఈ రాశి స్త్రీలకు అనుకూల సమయం. ఉద్యోగం, బయట పేరు ప్రఖ్యాతలు గడిస్తుంటారు. విద్యార్థులకు ఈ ఏడాది కలిసి వస్తుంది. విద్య, ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు.ప్రవేశ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు చూస్తారు.

ఈ రోజుల వారికి అదృష్ట సంఖ్య 6. ఏవైనా పనులు చక్కబెట్టుకోవాలనుకుంటే తులారాశి వారు మంగళవారం, గురువారం చేసుకుంటే బెటర్. అలాగే మంగళవారం కుజుడికి, గురువారం గురు మంత్రాలు, జపాలు చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. అలాగే తెలుపు రంగు పుష్పాలతో జగదాంబకు పూజలు చేయడం శ్రేయస్కరం. రోజూ భువనేశ్వరీ సహస్రనామ నారాయణ పారయణ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్త నక్షత్రం వారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆపద సమయంలో స్నేహితులు కలిసి వస్తారు. విశాఖ నక్షత్రం వారికి బుణాలకు సంబంధించి సమస్యలు తీరుతాయి. పుణ్య కార్యాలు చేస్తారు.

తులారాశి

  • ఆదాయం-2,
  • వ్యయం-8
  • రాజ్య పూజ్యం-1,
  • అవమానం-5
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.
Show comments