iDreamPost
android-app
ios-app

Ugadi 2024 Panchangam: క్రోధి నామ సంవత్సరం ధనుస్సు రాశి జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

  • Published Apr 08, 2024 | 1:20 PM Updated Updated Apr 08, 2024 | 6:32 PM

Ugadi 2024 Panchangam Dhanusu Rashi Phalalu in Telugu: క్రోధీనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వారి ఆదాయం ఎంత? రాజపూజ్యం, అవమానాలు ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం.

Ugadi 2024 Panchangam Dhanusu Rashi Phalalu in Telugu: క్రోధీనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వారి ఆదాయం ఎంత? రాజపూజ్యం, అవమానాలు ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 08, 2024 | 1:20 PMUpdated Apr 08, 2024 | 6:32 PM
Ugadi 2024 Panchangam: క్రోధి నామ సంవత్సరం ధనుస్సు రాశి జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇక ఉగాది పర్వదినం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పంచాగ శ్రవణం, రాశి ఫలాలు. ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు పండితులు, జ్యోతిశాస్త్ర నిపుణులు ఆ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి.. దేశవ్యాప్తంగా పరిస్థితులు, వాతావరణం, పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయో చెబుతుంటారు. ఉగాది నాడు ప్రతి ఒక్కరు పంచాగ శ్రవణం చేస్తారు. రాజకీయ నాయకులు సైతం.. తమ పార్టీ కార్యాలయాలు, ఇండ్లలో పంచాగ శ్రవణం ఏర్పాటు చేయించుకుంటారు. ఇక రాశుల వారీగా చూసుకుంటే.. ఈ క్రోధి నామ సంవత్సరంలో ధనుస్సు రాశి  ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది ధనుస్సు రాశి వారికి ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి.. జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చేప్పారంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ధనుస్సు రాశి వాళ్లకు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు, రైతులకు దిగుబడి చాలా సంతృప్తిగా ఉంటుంది.  పట్టిందల్లా బంగారం అని అంటున్నారు పండితులు.  ఉద్యోగులు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది రాజకీయ నేతలు, లాకర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లకు చాలా అనుకూలం. ఈ క్రోధీ నామ సంవత్సరంలో ధనస్సు రాశి జాతకాన్ని పరిశీలిస్తే వీరికి ఏడాది విశేషంగా కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.మీడియా, సినీ రంగాల వారికి మధ్యస్థం నుంచి అనుకూలత ఫలితాలు ఉంటాయి. కొంత ప్రతికూలత ఎదుర్కొన్నా అంతిమంగా వారే విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు.

క్రోధి నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఉద్యోగులకు మంచి ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.శత్రు వర్గం చేత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత ఉన్నప్పటికీ మీతో వ్యాపార సంబంధం కలిగిన వారు, వారు చేసే పనులు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ రాశి వారికి ధన లాభం ఉంది. ఈ విషయంలో ఆచూతూచీ నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అంటున్నారు. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు లభించనున్నాయని పండితులు చెబుతున్నారు. విద్యార్థులకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు.

ఈ ఏడాది ధనుస్సు రాశివారి ఆర్థక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని.. ప్రేమ విషయాలు అనుకూలించవు. జీవిత భాగస్వామితో సమస్యలు, ఘర్షణలు, చికాకులు ఉంటాయి. ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయం, ఆవేశం లాంటివి చూపించకూడదు. మానసిక ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. వ్యక్తిగత, కుటుంబ జీవితంలో కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారి పిల్లలు జీవితంలో అభివృద్ధి సాధిస్తారని పండితులు వెల్లడించారు. అయితే ఆర్థిక పరిస్థితి ఎంత అనుకూలించినా.. అనుకోని ఖర్చులు పెరుగుతాయని.. ఫలితంగా వ్యయాలు కూడా అధికంగా ఉంటాయని.. దీని పట్ల కాస్త జాగ్రత్త వహించాలని పండితులు సూచిస్తున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయాల్లో పురోగతి ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు, ఇతర టెన్షన్లకు దూరంగా ఉండాలని సూచన.

ఇక ఆదాయ, వ్యయాల విషయానికి వస్తే ఈ ఏడాది ధనుస్సు రాశీ వారికి

  • ఆదాయం-11,
  • వ్యయం-5,
  • రాజపూజ్యం-5,
  • అవమానం-5 గా ఉంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom