Raksha Bandhan: బలవంతంగా రాఖీ కట్టొద్దు.. కట్టించుకోవద్దు! ఇలా కట్టడం ఎంత తప్పో తెలుసా?

Raksha Bandhan: బలవంతంగా రాఖీ కట్టొద్దు.. కట్టించుకోవద్దు! ఇలా కట్టడం ఎంత తప్పో తెలుసా?

Raksha Bandhan: రక్షాబంధన్ వచ్చేస్తుంది. తోడబుట్టిన వాళ్ళకే కాకుండా బయటి వ్యక్తులకు కూడా రాఖీలు కట్టేస్తుంటారు. రాఖీ పండుగ వస్తే చాలు అమ్మాయిలు రాఖీలు పట్టుకుని అబ్బాయిల మీద దండయాత్ర చేయడానికి సిద్ధమైపోతారు. అబ్బాయిలు ఆ రాఖీలని మారణాయుధాలుగా భావించి పరుగులు పెడుతుంటారు. అయితే ఇలా బలవంతంగా రాఖీ కట్టడం ఎంత పెద్ద తప్పో తెలుసా?

Raksha Bandhan: రక్షాబంధన్ వచ్చేస్తుంది. తోడబుట్టిన వాళ్ళకే కాకుండా బయటి వ్యక్తులకు కూడా రాఖీలు కట్టేస్తుంటారు. రాఖీ పండుగ వస్తే చాలు అమ్మాయిలు రాఖీలు పట్టుకుని అబ్బాయిల మీద దండయాత్ర చేయడానికి సిద్ధమైపోతారు. అబ్బాయిలు ఆ రాఖీలని మారణాయుధాలుగా భావించి పరుగులు పెడుతుంటారు. అయితే ఇలా బలవంతంగా రాఖీ కట్టడం ఎంత పెద్ద తప్పో తెలుసా?

రక్షాబంధన్, రాఖీ పండుగ అనేది పవిత్రమైన పండుగ. తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు జరుపుకునే పర్వదినమిది. రాఖీ కట్టడం ద్వారా సోదరుల అండదండలు ఉంటాయని ఆడపిల్లలు భావిస్తారు. సోదరులు కూడా రాఖీ కట్టించుకున్నాక తమ అక్కలకు, చెల్లెళ్లకు కానుకలు ఇస్తుంటారు. కానుకలతో పాటు రక్షణగా ఉంటానని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. పెళ్ళై మెట్టినింటిలో ఉండే అమ్మాయిలు సోదరుల కోసం రక్షాబంధన్ రోజున పుట్టింటికి వచ్చేస్తారు. రాఖీ కట్టేసి సోదరుల దీవెనలు పొందుతారు. అంత పవిత్రమైన పండుగ ఇది. అలాంటి పవిత్రమైన పండుగను కొంతమంది అమ్మాయిలు పక్కదారి పట్టిస్తున్నారు. సొంత అన్నయ్యలకి, సొంత తమ్ముళ్లకే కాకుండా బయట వ్యక్తులకు కూడా రాఖీలు కడుతుంటారు కొంతమంది అమ్మాయిలు.

ఈ క్రమంలో బయట వ్యక్తులు అందరూ రాఖీ కట్టించుకోవడానికి సిద్ధంగా ఉండరు. అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడుతున్నారని.. తప్పించుకోవడం కోసం బలవంతంగా రాఖీ కడుతుంటారు. అమ్మాయిల ఉద్దేశం మంచిదే అయినా కూడా అలా చేయడం మంచిది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. బలవంతంగా రాఖీ కట్టడం వల్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అప్పటి వరకూ ఉన్న ఫ్రెండ్ షిప్ కూడా పోతుందని చెబుతున్నారు. ఇదంతా పెద్ద మేటర్ కాదు అని అనుకుంటే.. ఇంతకంటే పెద్ద సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనికి గతంలో జరిగిన పలు సంఘటనలే నిదర్శనం. కొంతమంది అబ్బాయిలు చాలా సున్నితంగా ఉంటారు.

అబ్బాయిలకి ఇష్టం లేకుండా బలవంతంగా రాఖీ కట్టే ప్రయత్నం చేస్తే జీవితాలు బలైపోతాయనడానికి గతంలో జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ. 2018లో ఆగస్టు 26న రాఖీ పండుగ వచ్చింది. అయితే త్రిపుర రాష్ట్రంలోని అగర్తల పట్టణంలో ఓ స్కూల్లో స్నేహితురాలు బలవంతంగా రాఖీ కట్టిందని బాలుడు పాఠశాల భవనం మీద నుంచి దూకేశాడు. ఉపాధ్యాయులు బలవంతంగా అబ్బాయిలకి అమ్మాయిలతో రాఖీలు కట్టిస్తుంటే ఒక విద్యార్ధి అందుకు ఒప్పుకోలేదు. దీంతో బలవంతంగా రాఖీ కట్టేసరికి ఆ అబ్బాయి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. ఇలాంటివి జరుగుతాయనే బలవంతంగా రాఖీ కట్టవద్దని చెబుతున్నారు. ఒక మనిషి ప్రాణం పోయేంత వరకూ తెచ్చుకోవడం ఎందుకు?

ప్రాణం పోతే అది జీవితాంతం తప్పు చేశామన్న భావనతో జీవించాల్సి ఉంటుంది. ప్రాణం పోయినందుకు జైలు శిక్ష కూడా పడుతుంది. ఆధ్యాత్మిక కోణంలో చూసినా గానీ అయిష్టంగా, బలవంతంగా చేసిన పనులు ఫలించవని పండితులు చెబుతున్నారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలానే రాఖీ కట్టేవారు, కట్టించుకునేవారి ఇద్దరి ఇష్టాలు కలవాలి. రాఖీ కట్టే ఉద్దేశం అమ్మాయిలకి ఉంటే సరిపోదు.. అబ్బాయిలకి కూడా ఉండాలి. రాఖీ కట్టడానికి రెండు చేతులుంటే సరిపోదు.. కట్టించుకునేందుకు అబ్బాయి మనసు కూడా ముఖ్యమే. కాబట్టి పవిత్రమైన పండుగను తోడబుట్టిన వ్యక్తులతో జరుపుకోండి. తోడబుట్టిన అన్నదమ్ములు లేకపోతే అభ్యంతరం లేని వారికి మాత్రమే కట్టండి. ఇష్టం లేని వారికి కట్టి ఇబ్బంది పెట్టకండి.. ఇబ్బందుల్లో పడకండి.

Show comments