Sri Rama Navami: శ్రీరామ నవమి రోజున ఈ పనులు చేస్తే చాలు.. ఇంట్లో ఐశ్వర్యం వెల్లి విరుస్తుంది

అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న పండుగ శ్రీరామ నవమి.. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమి పండుగ జరుపుకోనున్నారు. ఈ క్రమంలో నవమి రోజున ఏ ఏ ఆచారాలు పాటిస్తే సిరి సంపదలు నెలకొంటాయో తెలుసుకుందాం.

అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న పండుగ శ్రీరామ నవమి.. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమి పండుగ జరుపుకోనున్నారు. ఈ క్రమంలో నవమి రోజున ఏ ఏ ఆచారాలు పాటిస్తే సిరి సంపదలు నెలకొంటాయో తెలుసుకుందాం.

చైత్ర మాసం శుక్ల పక్ష నవమిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని చిన్న చిన్న గుడుల దగ్గర నుంచి.. పెద్ద పెద్ద ఆలయాల వరకు అన్ని కూడా సుందరంగా ముస్తాబు చేసి.. సీతా సమేత రాముల వారిని అలంకరించి.. సీతారాముల కళ్యాణం జరిపించి. ఊరు వాడా ఏకమై ఈ పండుగను ఆనందంగా కలిసి జరుపుకుంటారు. అయితే, ఈ మహత్తరమైన రోజునా కొన్నిటిని పాటిస్తే.. కొన్ని ఆచార వ్యవహారాలను పాటించడం వలన.. జీవితంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయని.. పండితులు చెబుతున్నారు. మరి శ్రీరామనవమి రోజున ఏ చర్యలు చేపట్టాలి అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే.. శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. దీని వలన భక్తుల ఇళ్లలో సంతోషం, శ్రేయస్సు విరాజిల్లుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు, అప్పుల బాధలో ఉన్న వారు ఈ పరిహారాన్ని చేయడం ద్వారా సంపదను పొందగలరని.. పండితులు చెబుతున్నారు. అలాగే నవమి రోజున అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చట. ఇంకా ఏళ్ల నుంచి వెంటాడుతున్న గ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. నవమి రోజున ఐదు గవ్వలు తీసుకుని.. వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి.. తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. ఇక మరొక పరిహారం విషయానికొస్తే.. ఎవరైనా సరే.. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే.. వారు దుర్గా దేవిని పూజిస్తూ.. ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా.. వ్యాధుల నుంచి ఉపశమనం పొంది మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి.

ఇక మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలంటే.. నవమి రోజు.. దుర్గా సప్తశతి పారాయణం చేయాలి. దీని వలన మానసిక ప్రశాంతత కూడా లభిస్తోంది. ఇక వివాహం అయిన స్త్రీలు పాటించవలసిన నియమాల విషయానికొస్తే.. వివాహిత మహిళలు సిద్ధిధాత్రికి పసుపు, కుంకుమ, గాజులు వంటివి సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా.. వారి దాంపత్య జీవనం ఎంతో ఆనందంగా ఉంటుందని నమ్ముతారు. ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా.. జీవితంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజున ఎవరైనా కూడా కొత్తగా ఏ పనిని ప్రారంభించినా కూడా అవి ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తాయని.. పండితులు చెబుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా, ప్రజల ఆశక్తిని దృష్టిలో ఉంచుకుని ఇచ్చినది. ఈ సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.

Show comments