iDreamPost
android-app
ios-app

Snake In Temple: సుబ్రమణ్య స్వామి ఆలయంలో అద్భుతం! విగ్రహంపై 6 అడుగుల నాగుపాము!

  • Published Dec 25, 2023 | 2:55 PMUpdated Dec 25, 2023 | 2:55 PM

దేవుడు ఉన్నాడు అని నిరూపించేందుకు ఆలయాల్లో జరిగే కొన్ని సంఘటనలు ప్రత్యేక్ష సాక్ష్యంగా నిలుస్తాయి. అలాంటి ఒక సంఘటనే తూర్పు గోదావరి జిల్లాలోని ఒక మందిరంలో చోటు చేసుకుంది. తండోప తండాలుగా భక్తులు ఈ దృశ్యాలను చూసేందుకు తరలి వస్తున్నారు.

దేవుడు ఉన్నాడు అని నిరూపించేందుకు ఆలయాల్లో జరిగే కొన్ని సంఘటనలు ప్రత్యేక్ష సాక్ష్యంగా నిలుస్తాయి. అలాంటి ఒక సంఘటనే తూర్పు గోదావరి జిల్లాలోని ఒక మందిరంలో చోటు చేసుకుంది. తండోప తండాలుగా భక్తులు ఈ దృశ్యాలను చూసేందుకు తరలి వస్తున్నారు.

  • Published Dec 25, 2023 | 2:55 PMUpdated Dec 25, 2023 | 2:55 PM
Snake In Temple: సుబ్రమణ్య స్వామి ఆలయంలో అద్భుతం! విగ్రహంపై 6 అడుగుల నాగుపాము!

ఇప్పటివరకు ఎన్నో ప్రాంతాలలో దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా .. ఆయన తన మహిమలను కనబరుస్తూనే ఉన్నాడు. కాల క్రమేణ దేవుడిని నమ్మని సామాన్యులు సైతం, ఆయన చూపించే కొన్ని మహిమల తరువాత.. భక్తులుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా అప్పుడప్పుడు ఆయన తన మహిమలను చూపిస్తూ.. భక్తులకు మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. తాజాగా, ఇటువంటి ఓ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో చోటు చేసుకుంది. సుమారు ఆరు అడుగుల త్రాచు పాము స్వామి వారి గర్భ గుడిలోకి ప్రవేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అది తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం.. అనంతపల్లి గ్రామం. ఆ గ్రామంలో స్వర్ణ దుర్గ ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో.. జంట నాగేంద్రుని ప్రతిమలు కొలువుతీరి ఉన్నాయి. సాధారణంగానే ప్రతి రోజు ఈ విగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా జంట నాగేంద్రుని ప్రతిమల పైన ఓ భారీ సర్పం దర్శనమిచ్చింది. సర్పాలను సహజంగానే నాగేంద్ర స్వామితో పోల్చుతారని తెల్సిందే. ఏకంగా ఆ నాగేంద్ర స్వామి వారి ఆలయంలోకే ఈ ఆరడుగుల త్రాచు పాము ప్రవేశించడంతో.. సాక్షాత్తు ఆ స్వామి వారే ప్రత్యేక్షమయ్యారని భక్తులు విశ్వసిస్తున్నారు.

సుమారు ఉదయం 7గంటల నుంచి ఆ సర్పం విగ్రహాల మీద ఉంది. ఆ ప్రతిమల పైన తిరుగుతూ బుసలు కొడుతూ, పడగ విప్పి నాట్యం చేస్తూ ఉంది. ఇప్పటివరకు ఎంతో మంది భక్తులు వచ్చినా సరే ఏ ఒక్కరికి హాని కలిగించలేదు. పైగా, గర్భ గుడిలోనుంచి బయటకు కూడా కదలలేదు. దీనితో అక్కడకు విచ్చేసిన భక్తులు దిగు దిగు దిగు నాగ.. అంటూ భక్తి పారవశ్యంతో కీర్తనలు పాడారు. పూజలు చేస్తూ.. హారతులు ఇస్తూ ఆ సర్పాన్ని కొలిచారు. సాక్షాత్తు ఇది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహమే అంటూ.. అదృష్టంగా భావించారు. ఈ విషయాన్నీ ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని.. ఆ దృశ్యాలను చూసేందుకు స్వామి వారి ఆలయానికి తరలి వచ్చారు . దీనితో ఈ విషయం తూర్పు గోదావరి జిల్లాలో ఓ వింతగా మారింది. ఇక జిల్లాలోని వాసులు కూడా స్వయంగా ఆ సర్పాన్ని నాగేంద్ర స్వామి వారి ప్రతి రూపంగా భావించి.. ఆ సర్పానికి పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించడానికి తండోప తండాలుగా పోటెత్తారు.

ఇదంతా స్వామి వారి మహిమ అంటూ చెప్పుకుంటున్నారు. సుమారు ఆరు గంటలకు పైగా ఆ సర్పం నాగేంద్రుని జంట ప్రతిమల పైన ఉంది. ఎంతో మంది భక్తులు ఈ దృశ్యాలను కళ్లారా తిలకించి స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు. ఆ తర్వాత కొంతసమయానికి ఆ సర్పం ఎవరికీ హాని చేయకుండా ఆలయంలో నుంచి బయట ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు షేర్ చేస్తున్నారు. మరి, స్వయానా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో సర్పం ప్రత్యేక్షమై.. తన మహిమలను చూపించిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి