iDreamPost
android-app
ios-app

నక్షత్రం మార్చుకుంటున్న శని.. ఈ మూడు రాశుల వారిపై కనక వర్షం కురవబోతుంది!

  • Published Apr 01, 2024 | 4:16 PM Updated Updated Apr 01, 2024 | 4:16 PM

ప్రతి ఏడాది సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటమనేది సహజమైన విషయమే. అయితే, ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 8వ తేదీన మొదట సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా శని కూడా నక్షత్రం మారతున్న క్రమంలో.. ఓ 3 రాశుల వారికి అదృష్టం వరిస్తున్నది. ఇంతకి ఆ 3 రాశులేవో తెలుసుకుందాం.

ప్రతి ఏడాది సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటమనేది సహజమైన విషయమే. అయితే, ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 8వ తేదీన మొదట సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా శని కూడా నక్షత్రం మారతున్న క్రమంలో.. ఓ 3 రాశుల వారికి అదృష్టం వరిస్తున్నది. ఇంతకి ఆ 3 రాశులేవో తెలుసుకుందాం.

  • Published Apr 01, 2024 | 4:16 PMUpdated Apr 01, 2024 | 4:16 PM
నక్షత్రం మార్చుకుంటున్న శని.. ఈ మూడు రాశుల వారిపై కనక వర్షం కురవబోతుంది!

శని ఈ పేరు వినగానే చాలామంది భయపడిపోతారు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏదైనా నక్షత్రంలో శని ప్రవేశిస్తే ఏం జరుగుతుందో, ఏలాంటి ప్రభావం చూపుతుందో అని అందోళనకు గురవుతుంటారు. మరి కొందరైతే ఏ చిన్న పొరపాటు, అపశకునం జరిగినా.. శని పట్టుకుందంటూ భయంద్రోళనకు గురవుతారు. మరి, అంతా ఫవర్ ఫుల్ అయిన ఈ శని ఈశ్వరుడంటే.. యమువడికంటే ఎక్కువగా భయపడుతుంటారు. అసలు ఇప్పటికే ఆ పేరు బయటకి తలిచిన ఏదో దోషంలా అభిప్రాయపడతారు. ఎందుకంటే.. ఆ శని వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో, జీవితం ఎలా మారిపోతుందో అని ఎంతోమంది ఆందోళనకు గురవుతారు. కానీ, ఆ శని అనుగ్రహం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాగే మన కర్మల అనుసారం ప్రకారమే శని దేవుడు ఫలితాలని ఇస్తాడు. అందుకే ఆయనను న్యాయదేవుడిగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే.. ఈనెల అనగా ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని అందరకీ తెలిసిందే. మరి ఆ సమయంలో శని కూడా నక్షత్రం మారుతుంది. ఇక శని కదలికల్లో భాగంగా.. 3 రాశుల వారికి ఆద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది.

ప్రతి ఏడాది సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటమనేది సహజమైన విషయమే. అయితే ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 8వ తేదీన మొదట సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది మీనరాశిలో జరుగుతుంది. కాగా, ఈ గ్రహణం ఏర్పడిన రెండు రోజుల ముందు మధ్యాహ్నం 3.55 గంటలకు శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చి గురువు నక్షత్రమైన పూర్వాభాద్రలోకి ప్రవేశిస్తాడు. ఇలా సూర్యుడు, శని నక్షత్రాన్ని మార్చడంవల్ల 3 రాశులవారిపై కనక వర్షం కురవబోతుంది. ఇంతకి ఆ మూడు రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి

మకర రాశి వారికి శని నక్షత్రం మార్పు వలన ఊహించని విధంగా సంపద వృద్ధి చెందుతుంది. పైగా అప్పుల ఊబి నుంచి తొందరగా బయటపడతారు. అంతేకాకుండా వీరు చెపెట్టే ప్రతి పనిన విజయవంతగా పూర్తి చేయడంవల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఇక ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. అలాగే కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. దీనితో పాటు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు.

మేషరాశి
ఈ రాశివారకి శని నక్షత్ర కదలికల వలన ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. అలాగే వీరి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ చేతికి అందుతుంది. అలాగే జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే వీరు ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు. ఇక వీరికి అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులను సకాలంలో పూర్తిచేసి సమాజంలో మంచి పేరును సంపాదించుకుంటారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునేవారు ఈ సమయంలో తమ ప్రయత్నాలను కొనసాగించాలి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి శని నక్షత్ర సంచారం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీనితో పాటు ఎప్పటినుంచో అనుకుంటున్న ఉద్యోగం లభిస్తుంది. ఇక ఆదాయం పెరుగుదల కూడా బాగుంటుంది. దీనితో పాటు దీర్ఘకాలికంగా నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. అలాగే సొంతంగా వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో మంచి లాభాలు కలుగుతాయి. పైగా ఆర్థికంగా పటిష్టమైన స్థితికి చేరుకుంటారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేయడంలో అదృష్టం తోడుంటుంది.

ఇక పైన ఉన్న రాశుల జాబితాలో కనుక మీ రాశి ఉందో లేదో ఇప్పుడే తెలుసుకొని వెంటనే మీరు పూర్తి చేయాలనుకున్న పనులను తక్షణమే పూర్తి చేసేయండి. మరి, శని నక్షత్రం మారబోతున్న సందర్భంగా ఈ 3 రాశులపై అదృష్టం వరిస్తుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis giriş