వరలక్ష్మీ వ్రతం రోజు ఈ ఒక్క పని చేస్తే కాసుల వర్షమే!

హిందువులకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. ఆ మాసాన్ని ఎంతో శుభ సూచకంగా భావిస్తుంటారు. శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, శుభకార్యాలు ఎక్కువగా చేస్తుంటారు. అలాగే ఆ నెలలో వచ్చే వరలక్ష్మీ వ్రతం హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ రోజు భక్రి శ్రద్ధలతో పూజలు చేసి.. లక్ష్మీదేవి సాదరంగా తమ ఇంటికి ఆహ్వానిస్తారు. పురాణాలు, విశ్వాసాల ప్రకారం వరలక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతుంటారు. అయితే మీరు వ్రతం చేసే పరిస్థితుల్లో లేకపోయినా కూడా మీరు అమ్మవారి కృపను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతంరోజు మీరు ఒక చిన్న పని చేస్తే ఆ లక్ష్మీదేవి అమ్మారి కటాక్షం మీపై ఉంటుందంట.

శ్రావణ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. శ్రావణ శుక్రవారాలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి మరిత ప్రాముఖ్యత ఉంది. ఈరోజు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తుంటారు. ఈరోజు సూర్యోదయాని ముందే నిద్రలేచి తలంటు స్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని చక్కగా పూలు, తోరణాలతో ఇంటిని అలంకరించుకుంటారు. అమ్మవారి పూజ కోసం పీఠం, కలశం, లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అమ్మవారికి నైవేద్యం కోసం రకరకాల పిండివంటలు, పొంగలి చేసుకుంటారు. ముఖ్యంగా అమ్మవారిని చీర, గాజులు, నగలతో అలంకరిస్తారు.

ఇలా భక్రిశ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం వారిపై ఉంటుందని నమ్ముతారు. ఏదైనా పూజ అనగానే అందుకు నియమాలు, నిబంధనలు, మడులు, ఆచారాలు అని ఉంటాయి. కానీ, వరలక్ష్మీ వ్రతానికి అలాంటివి ఏమీ ఉండవని చెబుతారు. అంతేకాకుండా స్వచ్ఛమైన, నిర్మలమైన మనసుతో మీరు ఆ అమ్మవారిని స్మరిస్తే కోరిక కోరికలు తీరుస్తుంది అంటారు. అలాగే వరలక్ష్మీ వ్రతం రోజు అందరికీ పూజ చేసుకునే భాగ్యం దొరకకపోవచ్చు. హడావుడి జీవితం, ఏమైనా ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నవారు ఎంతో బాధపడిపోతారు. ఈ ఏడాది అమ్మవారికి పూజ చేయలేకపోయామే అని దిగులు పడతారు. అలా అయితే వారిపై ఆ అమ్మవారి కరుణ, కటాక్షాలు ఉండమేమో అని కంగారు పడతారు. కానీ, పండితులు చెబుతున్న దాని ప్రకారం మీరు లక్ష్మీదేవి కటాక్షం కోసం వరలక్ష్మీ వ్రతం తప్పకుండా చేయాల్సిన అవసరమేమీ లేదని చెబుతున్నారు.

అనివార్య కారణాల రీత్యా మీరు వరలక్ష్మీ వ్రతం చేయలేకపోతే.. ఆరోజు మనసారా అమ్మవారిని స్మరించుకోవడం, అమ్మవారి నామస్మరణ చేయడం, అమ్మవారిని ధ్యానించడం, లక్ష్మీదేవి అమ్మవారి కథలు, వరలక్ష్మీ వ్రత ప్రాముఖ్యతను ఆలకించడం, పటించడం లాంటివి చేస్తే ఆ అమ్మవారి కృప తప్పకుండా దక్కుతుందని చెబుతున్నారు. ఈరోజు అంతా అమ్మవారి నామ స్మరణ చేస్తే అంతా మంచే జరుగుతుందని పురోహితులు సెలవిస్తున్నారు. ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతం ప్రారంభించడానికి ఉదయం 9.15 గంటలు అనుకూలమైన సమయంగా చెబుతున్నారు. వర మహాలక్ష్మీ వ్రతం చేసేవాళ్లు ‘‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభయో నమః’’ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు.

Show comments