iDreamPost
android-app
ios-app

మీ ఇంట్లో మనీప్లాంట్ ఈ దిక్కున పెడితే మంచి ధనలాభం!

  • Published Apr 04, 2024 | 9:58 PM Updated Updated Apr 04, 2024 | 9:58 PM

Money Plant in The House is Placed: భారతీయులు ప్రతి చెట్టూ, పుట్ట, రాయిని అన్నింటిలో భగవంతుడిని చూస్తారు.. పూజిస్తారు. వేప చెట్టు, రావి చెట్టు ఇంటి పరిసరాల్లో ఉండే తులసి చెట్టు నిత్యం పూజలు చేస్తుంటారు.

Money Plant in The House is Placed: భారతీయులు ప్రతి చెట్టూ, పుట్ట, రాయిని అన్నింటిలో భగవంతుడిని చూస్తారు.. పూజిస్తారు. వేప చెట్టు, రావి చెట్టు ఇంటి పరిసరాల్లో ఉండే తులసి చెట్టు నిత్యం పూజలు చేస్తుంటారు.

  • Published Apr 04, 2024 | 9:58 PMUpdated Apr 04, 2024 | 9:58 PM
మీ ఇంట్లో మనీప్లాంట్ ఈ దిక్కున పెడితే మంచి ధనలాభం!

పూర్వ కాలం నుంచి దేశంలో చెట్లను పూజించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. తులసి చెట్టును లక్ష్మీదేవిగా పూజిస్తుంటారు. నిత్యం తులసి మాతను పూజిస్తే.. ఊహించని లాభాలు కలుగుతాయి. ఇంట్లో ఆనందం, సంపద రెట్టింపు చేస్తుందని నమ్ముతుంటారు. ఇప్పుడు చాలా వరకు అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చింది. చాలా మంది తులసి మొక్కనే కాదు.. మనీ ప్లాంట్ ను కూడా పెంచుకుంటున్నారు. మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్ముతున్నారు. అయితే మనీ ప్లాంట్ ఏ దిక్కున పెడితే కలిసి వస్తుందన్న విషయం గురించి తెలుసుకుందాం.

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా అపార్ట్ మెంట్, విల్లా కల్చర్ నడుస్తుంది. చాలా వరకు తమ ఇండ్లల్లో మనీ ప్లాంట్ పెంచుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. అయితే దీనికి ఓ కారణం కూడా ఉంది. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషంతో పాటు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని చాలా మంది నమ్ముతున్నారు. ఈ మొక్క పచ్చగా తమలపాకు మాదిరిగా ఉంటుంది. ఈ మొక్క ఉంటే చుట్టుపక్కల పాజిటీవ్ ఎనర్జీ ఉంటుందని అంటారు. నమ్మకాన్ని మించింది ఏముంటుంది? అందుకే మనీ ప్లాంట్ పెంచుకోవాలని ఇతరులకు కూడా సలహాలు ఇస్తున్నారు. అయితే మనీ ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ.. ఏ దిక్కున పడితే ఆ దిక్కున పెడితే కలిసి రాదు.

Money Plant

మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో ఈశాన్య భాగంలో అసలు పెట్టకూడదు.. దీని వల్ల లేనిపోని దరిద్రం కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మనీ ప్లాంట్ ను ఇంట్లో ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలట.ఇది విగ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కు. ఈ దిక్కున మనీ ప్లాంట్ మొక్కని పెడితో ఇంట్లో పాజిటీవ్ ఎనర్జీతో పాటు ధనం బాగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆరోగ్యం కూడా బాగుంటుందని నమ్మకం. మనీ ప్లాంట్ నీళ్లను తాకకుండా ఎదిగేట్టు చూసుకోవాలట.. వాస్త ప్రకారం తీగలు ఎంత పెరిగితే అంత కలిసి వస్తుందని అంటున్నారు. మనీ ప్లాంట్ లో లక్ష్మీ దేవత కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థికంగానే కాదు.. ఆయురారోగ్యాలు బాగుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio