iDreamPost
android-app
ios-app

ఆగస్టులో ఈ 5 ఐదు రాశుల వారికి రాజయోగం! కారణమిదే!

Astrology: జులై 31న శుక్రుడు తన దిశను మార్చుకుని సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటి నుంచి చాలా రోజుల పాటు ఇదే రాశిలో ఉంటాడు. అప్పటికే సింహరాశిలో ఉన్న బుధుడు, శుక్రుడి కలయికతే కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Astrology: జులై 31న శుక్రుడు తన దిశను మార్చుకుని సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటి నుంచి చాలా రోజుల పాటు ఇదే రాశిలో ఉంటాడు. అప్పటికే సింహరాశిలో ఉన్న బుధుడు, శుక్రుడి కలయికతే కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఆగస్టులో ఈ 5 ఐదు రాశుల వారికి రాజయోగం! కారణమిదే!

హిందూశాస్త్రం, పురాణల ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు, రాశులకు సంబంధించి అనేక మార్పులు జరుగుతుంటాయి. గ్రహాలు కక్ష్యలు మారడం, వివిధ రాశుల్లోకి ప్రవేశించడం వంటివి జరుగుతుంటాయి. ఇలా గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు వాటివాటి కక్ష్యలో మార్పులు జరిగినప్పుడు ఆయా రాశుల వారికి మంచిచెడులు జరుగుతుంటాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో జూలై 31న ఒక ఘటన జరగనుంది. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలోనే ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి..ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

గ్రహాలకు రాజకుమారుడని బుధుడని అంటారు జ్యోతిష్యనిపుణులు. అలాంటి బుధుడు జూలై 16వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించాడు. అదే రాశిలో ఆగష్టు 22వరకు సంచరిస్తాడు. ఇదే సమయంలో జూలై 31న శుక్రుడు తన దిశను మార్చుకుని బుధుడు ఉన్న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు శుక్రుడు, బుధుడు సింహరాశిలోనే సంచరిస్తుంటారు. సింహం రాశిలో బుధుడు, శుక్రుడి కలయిక వల్ల  కొన్ని రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  సింహరాశి లో శుక్రుడి సంచారం వలన మేషరాశి, మిథునరాశి, మకర రాశి, తులారాశి, మీనరాశి వారు పట్టిందల్లా బంగారమేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మేష రాశి:

శుక్రుడు, బుధుడు సింహరాశిలో కలసి సంచరించడంతో మేషరాశి వారికి అన్నిరంగాల్లో విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈ రాశివారు పట్టిన ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. వివాహితులు తమ కుటుంబాలతో కలిసి యాత్రలు వెళ్లే అవకాశం ఉంది. వాహనాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి ప్రగతి సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి సమయం.

వృషభ రాశి:

సింహరాశిలో శుక్రడు, బుధుడి సంచారం వలన లాభ పడే మరోసారి వృషభ రాశి. ఈ రాశి వాళ్లు ఇంటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం పరంగా మరో మెట్టుపైకి ఎక్కనున్నారు. మధ్యలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో భారీగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది.

మిథున రాశి:

శుక్రుడు, బుధుడు సింహరాశిలో సంచరించడం వలన  మిథున రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి రంగంలో విజయం సాధించడంతో పాటు కుటుంబ, వైవాహిక జీవితంలో సంతోషం లభిస్తుంది. ఈ రాశివారికి ఆఫీసుల్లో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు కొత్తగా ఇన్వెస్ట్ చేసే పెట్టే అవకాశం ఉంది.

 తులారాశి:

సింహరాశిలో శుక్రుడు సంచారం వలన ఈ రాశికి చెందిన వారిలోని వ్యాపారస్తులు రానున్న రోజుల్లో మంచి లాభాలను పొందే ఛాన్స్ ఉంది. దీర్ఘ కాలంగా ఉన్న రుణాలను చెల్లించగలుగుతారు. అదే విధంగా వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మానసిక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారికి పరిష్కారం లభిస్తుంది. వస్తు సంపదలో పెరుగుదల ఉంటుంది. ఈ రాశివారు కోరికలన్నీ ఒక దాని తర్వాత మరొకటి తీరుతాయి.

మకరరాశి:

బుధ, శుక్రులు సింహరాశిలో సంచరించడం వల్ల ఈరాశి వారి కుటుంబ సంబంధాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశముంది. విదేశాల్లో వెళ్లాలని అనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. వ్యాపార రంగంలో ఉండే వారు..వారికి ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారి సంసార జీవితం చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు.

మీన రాశి:

బుధ, శుక్రులు సింహరాశిలో సంచరించడం వల్ల మీనరాశి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. కొన్నిరోజులుగా ఆరోగ్యం బాధపడే వారికి.. వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి  అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ అనుకూలత కారణంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ ప్రపోజల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. మొత్తంగా ప్రధానంపై ఐదు రాశులక వారికి పట్టిందల్ల బంగారమే కానుందని జోతిష్య నిపుణలు చెబుతున్నారు

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabet