Krishna Janmashtami 2024: కృష్ణాష్టమి రోజు కన్నయ్యను ఈ పూలతో పూజిస్తే.. మీకిక తిరుగుండదు!

Krishna Janmashtami 2024-Flower Is Offered: కృష్ణాష్టమి వేడుకలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రజలు కన్నయ్య మీద భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నారు. ఇక ఈ పండుగ నాడు ఒక్కో రకం పూలతో పూజిస్తే.. ఒక్కో ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఆ వివరాలు..

Krishna Janmashtami 2024-Flower Is Offered: కృష్ణాష్టమి వేడుకలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రజలు కన్నయ్య మీద భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నారు. ఇక ఈ పండుగ నాడు ఒక్కో రకం పూలతో పూజిస్తే.. ఒక్కో ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఆ వివరాలు..

శ్రావణమాసం ప్రారంభం అయ్యిందంటే చాలు.. పండగలు వరుస పెట్టి వస్తాయి. వరలక్ష్మి వ్రతంతో పర్వదినాలు మొదలవుతాయి. ఇక ఈ సోమవారం అనగా.. ఆగస్టు 26 న హిందువులు పవిత్రంగా జరుపుకునే పండగలలో ఒకటైన.. శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ వస్తుంది. దీన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా అంటారు. కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా.. ఈ పండుగ జరుపుకుంటారు. ప్రతీ ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షం, అష్టమి తిథి, రోహిణి నక్షత్రం నాడు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. జన్మాష్టమి నాడు కృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ.. చిన్న చిన్న పాదాలను ముద్రిస్తారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్లు.. తమ బిడ్డలను కన్నయ్యలా అలంకరించి.. మురిసిపోతారు.

వెన్న, అటుకులతో ప్రసాదాలు చేసి సమర్పిస్తారు. కృష్ణాష్టమి నాడు సమర్పించే ప్రసాదాలకు ఎంత విశిష్టత ఉంటుందో.. ఆ రోజు కన్నయ్యను పూజించే పూలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈ పండుగ నాడు శ్రీ కృష్ణుడిని ఏవిధమైన పూలతో పూజిస్తే ఎలాంటి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పూజా విధానం..

గోకులాష్టమి రోజున ఇంటిని శుభ్రం చేసుకుని.. తలరా స్నానం చేసి.. శుభ్రమైన బట్టలు ధరించాలి. పగలంతా ఉపవాసం ఉండి.. సాయంకాలం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణుని పూజిస్తారు. అయితే, జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుడిని నీలం రంగు పుష్పాలతో పూజిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అంతేకాక ఈ పర్వదినం నాడు స్వామి వారిని తులసి దళాలతో ఆరాధిస్తే ఆయన సంపూర్ణ మైన అనుగ్రహం లభిస్తుందంటున్నారు.

ఏ పూలతో పూజిస్తే.. ఎలాంటి ఫలితం..

  • శ్రీకృష్ణాష్టమి నాడు కన్నయ్యను ఒక్కో రకం పూలతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు పండితులు.
  • కృష్ణాష్టమి నాడు కన్నయ్యను జాజిపూలతో పూజించినట్లయితే.. ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.
  • సంపంగి పూలతో పూజిస్తే.. శత్రు బాధలన్నీ తొలగిపోతాయట.
  • పారిజాత పూలతో ఆరాధిస్తే.. జాతకంలో ఉన్న పన్నెండు రకాల కాల సర్ప దోషాలను తొలుగుతాయట.
  • పద్మ పుష్పాలతో కన్నయ్యను పూజిస్తే.. అష్టైశ్వర్యాలు సిద్ధించి శ్రీమంతులు అవుతారని చెబుతున్నారు పండితులు.
  • మల్లెపూలతో ఆరాధిస్తే.. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
  • గన్నేరు పుష్పాలతో పూజిస్తే.. కవిత్వం, వాక్చాతుర్యం పెరుగుతుందని చెబుతున్నారు.
  • తుమ్మి పూలతో కృష్ణుడిని ఆరాధిస్తే.. ఆయన పట్ల మన భక్తి మరింత పెరుగుతుందంటున్నారు.
  • నందివర్ధనం పుష్పాలతో పూజిస్తే.. ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని అంటున్నారు.
  • తెల్ల జిల్లేడు పూలతో ఆరాధిస్తే.. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులంటున్నారు.
  • పొద్దుతిరుగుడు పూలతో ఆరాధిస్తే.. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు.

ఇలా కృష్ణాష్టమి పండుగ నాడు శ్రీ కృష్ణుడిని ఒక్కొక్క పూలతో పూజిస్తే ఒక్కొక రకమైన విశేషమైన ప్రయోజనం లభిస్తుందని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్.

Show comments