iDreamPost
android-app
ios-app

గురుపౌర్ణమి విశిష్టత ఏమిటి? గురు అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి!

  • Published Jul 20, 2024 | 7:17 AM Updated Updated Jul 20, 2024 | 7:17 AM

Guru Purnima 2024: హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకున్న పండుగల్లో గురుపౌర్ణమి కూడా ఒకటి. అయితే ఈ పండుగను ఈ ఏడాది ఇప్పుడు చేసుకుంటున్నారు? ఈ పండుగ విశిష్టత ఏమిటి ? ఆ రోజున ఏం చేస్తే గురు అనుగ్రహం పొందుతం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Guru Purnima 2024: హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకున్న పండుగల్లో గురుపౌర్ణమి కూడా ఒకటి. అయితే ఈ పండుగను ఈ ఏడాది ఇప్పుడు చేసుకుంటున్నారు? ఈ పండుగ విశిష్టత ఏమిటి ? ఆ రోజున ఏం చేస్తే గురు అనుగ్రహం పొందుతం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jul 20, 2024 | 7:17 AMUpdated Jul 20, 2024 | 7:17 AM
గురుపౌర్ణమి విశిష్టత ఏమిటి?  గురు అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి!

భారత దేశంలోని హిందువులకు ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. మరి అలాంటి పండుగల్లో గురు పౌర్ణమి పండుగ కూడా ఒకటి.ఈ పండుగను హిందువులు ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. అయితే ప్రతి ఏటా హిందూ సంప్రదాయ ప్రకారం.. ఈ పండుగ ఆషాఢ పౌర్ణమి తిధి రోజున పడుతుంది. కానీ, ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిధి రెండు రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది. అయితే ఈ పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది.ఇకపోతే హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం సముయంలో ఉన్న తిధి ని పరిగణలోకి తీసుకుంటారు కనుక జూలై 21వ తేదీ ఉదయం 05:37 గంటలకు ఆషాఢ పౌర్ణమి తిథి నాడు సూర్యోదయం అవుతుంది. ఇదిలా ఉంటే.. ఇంతకి ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత ఏమిటి? దీనిని ఎందుకు ఇంత ప్రత్యేకంగా జరుపుకుంటారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గురుపౌర్ణమి విశిష్టత:
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకున్న ఈ గురు పౌర్ణమి పండుగ వెనుక ఒక ప్రత్యేకత విశిష్టత ఉంది. ఈ గురు పౌర్ణమి అనేది గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు చేసుకునే పండుగ. ఎందుకంటే.. సనాతన హైందవ ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కింది. పైగా ఈ సృష్టిలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటునే ఉంటాడు. కానీ, ఈ విషయంలో కొంతవరకే తల్లిదండ్రుల వద్ద మనం నేర్చుకోగలం. మిగిలినదంత గురువు దగ్గరే నేర్చుకోవాలి. మరి, ఓనమాలు దిద్దే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే ఈ ప్రయాణంలో గురువు పాత్ర చాలా కీలకమైనది. అందుకే గురువును.. ”గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః, గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః” అని అంటారు.

ఇక్కడ గురు అంటే.. సంస్కృతంలో ‘గు’ అనే శబ్దానికి చీకటి అని అర్థం. ‘రు’ అంటే నాశనం చేసే తేజస్సు అని అర్ధం. అజ్ఞానం అనే చీకటిని.. తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువని అర్ధం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. మనకు తెలియని విషయాలను చెప్తూ.. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానసంపన్నుడు,గుణసంపన్నుడుగా గురువు ఉంటాడు. ముఖ్యంగా చదువు, జ్ఞానంతో పాటు ఏ దారిలో నడివాలి, ఏ గమ్యం వైపు నడిపించాలో గురువే మార్గదర్శిగా నిలుస్తాడు. ఈ గురు పౌర్ణమినే వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు.

గురుపౌర్ణమి చరిత్ర:

అయితే పురణాల ప్రకారం ఈ గురుపౌర్ణమికి ఒక చరిత్ర కూడా ఉంది. అదేమిటంటే.. గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.అందుకే ఈ గురుపౌర్ణమిని వ్యాస పూర్ణిమి అని కూడా అంటారు.అయితే పురణాల ప్రకారం ఈ వ్యాసమహర్షికి పెద్ద చరిత్ర కూడా ఉంది. ఇక ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకే ఆ రోజున భగవంతునితో సమానమైన గురువులను నమస్కారించి పూజించుకోవాలి.

గురుపౌర్ణమి రోజు గురు అనుగ్రహం పొందలంటే చేయలసిన పరిహారాలు:

గురు పూర్ణిమ నాడు గురు అనుగ్రహం పొందలంటే.. ఆ రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్లి ఇంటికి ఆహ్వానించండి. వారి పాదాలను తాకి ఆశీర్వాదం పొందండి. అప్పుడు వారికి ఆహారం అందించి, తగిన బహుమతులు ఇవ్వండి. గురు పూర్ణిమ రోజున ఇలా చేయడం వల్ల ప్రతి రంగంలో పురోగతిని పొందుతారు. ఎందుకంటే గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని నమ్మకం. అంతేకాకుండా.. గురు పూర్ణిమ రోజున పేద బ్రాహ్మణుడికి పసుపు వస్త్రాలు, పసుపు, ఇత్తడి పాత్రలు, బెల్లం, నెయ్యి, పసుపు బియ్యం మొదలైన వాటిని దానం చేయండి. ఈ రోజున దేవ గురువైన బృహస్పతిని ఆరాధించడం వలన సంతోషం, సౌభాగ్యం ఐశ్వరం కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler