రాఖీ రోజున సంతోషి మాతను ఎందుకు పూజిస్తారా తెలుసా?

Rakhi Festival 2024: పురణాల ప్రకారం.. రాఖీ రోజున దేవతమూర్తి అయిన సంతోషిమాతను ఎందుకు పూజిస్తారనేది చాలామంది తెలియదు. పైగా ఈ దేవీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అసలు రాఖీకి, సంతోషి మాతకు సంబంధం ఏమిటి? ఆ రోజునే ఆ దేవతను ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Rakhi Festival 2024: పురణాల ప్రకారం.. రాఖీ రోజున దేవతమూర్తి అయిన సంతోషిమాతను ఎందుకు పూజిస్తారనేది చాలామంది తెలియదు. పైగా ఈ దేవీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అసలు రాఖీకి, సంతోషి మాతకు సంబంధం ఏమిటి? ఆ రోజునే ఆ దేవతను ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిఏటా శ్రావణమాసంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటారనే విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఈ రాఖీ పండుగను ఆగస్టు 19 తేదీన జరుపుకుంటున్నారు. ఇకపోతే ఈ రాఖీ పండుగా అనేది వయసుతో సంబంధం లేకుండా.. అన్నా, చెల్లెళ్లు, అక్కా-తముళ్ల మధ్య బంధానికి ప్రతీకగా భావిస్తూ జరుపుకుంటారు. పైగా ఈ పండుగకు కుల,మతాలకు అతీతంగా జరుపుకున్న పండుగలో రాఖీ కూడా ఒకటి. కనుక ఈ పండుగను అత్యంత పవిత్రమైన పండుగగా భావిస్తారు. అయితే పురణాల ప్రకారం.. రాఖీ పండుగకు చాలా విశిష్టత ఉంది. మరీ ఈ రాఖీ పండుగనాడు చాలామంది హిందువులు దేవతామూర్తి అయిన సంతోషి మాతను పూజిస్తారని చాలామందికి తెలియదు. అసలు రాఖీకి, సంతోషి మాతకు సంబంధం ఏమిటి? ఆ రోజునే ఆ దేవతను ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పురణాల ప్రకారం.. రాఖీ రోజున దేవతమూర్తి అయిన సంతోషిమాతను ఎందుకు పూజిస్తారనేది చాలామంది తెలియదు. పైగా ఈ దేవీ గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే.. సంతోషి మాత నేప‌థ్యం గురించి ఆ నోట ఈ నోట వినిపించ‌డ‌మే కానీ, పురాణాల‌లో ఆమె ప్రస‌క్తి అంత‌గా క‌నిపించ‌దు. కానీ, నిజానికి సంతోషి మాత వినాయకుని కుమార్తె. అంతేకాకుండా.. ఈమె రాఖీ పర్వదీనాన దేవతామూర్తిగా జన్మించిన స్త్రీ. అయితే ఈ దేవి జన్మదినం వెనుక కథమేమింటంటే.. ఒక ర‌క్షాబంధ‌నం రోజున అన్నద‌మ్ములంద‌రూ, అక్కచెల్లెళ్లతో రాఖీ క‌ట్టించుకుంటున్నార‌ట‌. అయితే ఆ దృశ్యాల‌ని గ‌మ‌నించిన వినాయ‌కుని కుమారులు లాభం, క్షేమం కు చాలా బాధ క‌లిగింద‌ట‌. త‌మ‌కి కూడా ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండేదో అని వాళ్లు అనుకున్నార‌ట.
ఇక కుమారుల బాధను చూసిన మహా గణపతి, నారదుడుకి ఆ పిల్లల కోరికను తీర్చమని కోరారట. అయితే నారదుని సలహా మేరకు.. వినాయకుడు తమ కుమారుల కోరికలను నెరవేర్చేందుకు, అతని భార్యలు రిద్ధి, సిద్ధి శరీరం నుండి ఒక ఖగోళ కాంతి ఉద్భవించేలా చేసి,  ఆ కాంతి నుంచి ఓ అమ్మాయిని సృష్టించారు. ఇక ఆ కాంతి నుండి జన్మించిన ఈ అమ్మాయి సంతోషి దేవత. సంతోషి మా అని పూజించబడే గణేశుడి కుమార్తె. అయితే వినాయకుని కుటుంబంలోకి సరికొత్త సంతోషాల‌ను తీసుకువ‌చ్చింది కాబ‌ట్టి, ఆమెను సంతోషిమాత‌గా పిల‌వ‌సాగారు.
కేవ‌లం దేవ‌త‌ల‌కే కాదు, త‌న‌ని కొలిచిన మాన‌వులంద‌రికీ స‌క‌ల‌సంతోషాల‌నూ ప్రసాదించే దేవిగా ఆ పేరుతో ఆమెకు ప్రసిద్ధిగా నిలిచిపోయింది. ఇక రాఖీ పర్వదీనఆన పుట్టిన దేవీ కాబట్టి అలా అప్పటి నుంచి ఆ రోజున ఈ సంతోషిమాతను హిందువులు పూజిస్తుంటాఉ. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రల్లో ఎక్కువగా ఈ సంతోషిమాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలా పూజించడం వలన ఆ దేవి అనుగ్రహం పొంది, అష్టఐశ్వర్యలు, సుఖ సంపదాలు కలుగుతాయని నమ్ముతారు.
Show comments