అజ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి!

Aja Ekadashi 2024: హిందువులు పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అజ ఏకాదశి’ అని అంటారు. ఈ రోజు ఉపవాస దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం..

Aja Ekadashi 2024: హిందువులు పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అజ ఏకాదశి’ అని అంటారు. ఈ రోజు ఉపవాస దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం..

హిందూ మతంలో ఏకాదశి పరమ పవిత్రంగా భావిస్తుంటారు.. దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంతో గొప్ప ఉంది. ఆనందం, ఆరోగ్యం, భోగభాగ్యాలు కలిగి ఉండాలని కోరుతూ భక్తులు ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున, భక్తులు ఉపవాసం ఉంటూ భక్తితో విష్ణువును ప్రార్థిస్తారు. అజ ఏకాదశి భాద్రపద మాసంలో కృష్ణ పక్షం 11వ రోజున జరుపుకుంటారు.ఈ ఏడాది ఆగష్టు 29, 2024న జరుపుకునే అజా ఏకాదశి. ఈ సందర్బంగా భక్తులు ఉదయం లేచి దేవాలయాలకు వెళ్లి స్వామి వారిని పూజిస్తారు.దేశమంతా వైష్ణవ దేవాలయాలు కిటకిటలాడుతాయి. అజ ఏకదాశి రోజున ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ప్రతి ఏడాదికి 24 ఏకాదశిలు..వాటిలో శ్రావణ మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అజ ఏకాదశి’అని పిలుస్తారు. అజ ఏకాదశి రోజున ఉపవాస నియమాలు పాటిస్తూ శ్రీ మహావిష్ణువుతో పాటు మహాలక్ష్మిని పూజిస్తే సకల పాపాలు హరించిపోవడమే కాదు.. సకల సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు భక్తితో స్వామికి వారికి పూజలు చేస్తే అశ్వమేధ యాగానికి సమానమైన ప్రయోజనాలు కలుగుతాయని విశ్వసిస్తారు.ఈ ఏడాది ‘అజ ఏకాదశి’ ఆగస్టు 29 గురువారం వచ్చింది. దీన్నే స్మార్త ఏకాదశి, గురు ఏకాదశి అని కూడా అంటారు. ప్రతి ఏటా జన్మాష్టమి నాలుగు రోజుల తర్వాత ఈ ఏకాదశి వస్తుంది. అజ ఏకాదశి రోజున  తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని వైష్ణవ దేవాలయాలకు ఎక్కువగా వెళ్తుంటారు భక్తులు.

Show comments