iDreamPost
android-app
ios-app

రైలుతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించి.. ప్రాణాలు కోల్పోయిన యువతి

  • Published Jun 07, 2024 | 8:27 AM Updated Updated Jun 07, 2024 | 8:27 AM

సెల్ఫీల సరదా ప్రాణాలను బలిగొంటున్నది. ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఫొటోల కోసం ప్రయత్నించొద్దని చెప్పినా వినకుండా ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈక్రమంలో ఓ యువతి ట్రైన్ తో సెల్ఫీకి ప్రయత్నించి దుర్మణం చెందింది.

సెల్ఫీల సరదా ప్రాణాలను బలిగొంటున్నది. ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఫొటోల కోసం ప్రయత్నించొద్దని చెప్పినా వినకుండా ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఈక్రమంలో ఓ యువతి ట్రైన్ తో సెల్ఫీకి ప్రయత్నించి దుర్మణం చెందింది.

  • Published Jun 07, 2024 | 8:27 AMUpdated Jun 07, 2024 | 8:27 AM
రైలుతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించి.. ప్రాణాలు కోల్పోయిన యువతి

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఫోటోల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎక్కడపడితే అక్కడ ఫోటోలు దిగుతూ నానా రచ్చ చేస్తుంటారు కొంతమంది. సెల్ఫీల మోజులో పడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం ప్రమాదకరమైన రీతిలో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గతంలో రిజర్వాయర్స్, వాటర్ ఫాల్స్, రన్నింగ్ ట్రైన్ల వద్ద సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అయినా కూడా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ యువతి సెల్ఫీ మోజులో పడి ప్రాణాన్ని కోల్పోయింది. అంతా చూస్తుండగానే రైలు ఢీకొన్ని దుర్మరణంపాలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

సెల్ఫీల సరదా ప్రాణాలను బలిగొంటున్నది. సెల్ఫీల కోసం యత్నించి యువత తమ ప్రాణాలను కోల్పోతున్నారు. డేంజర్ జోన్ లో సెల్పీల కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజగా మెక్సికోలోని హిడాల్గోలోని ఫేమస్ అయిన ఆవిరి ఇంజిన్ తో నడిచే రైలు వస్తున్న సమయంలో రైలుకు దగ్గరగా వెళ్లి సెల్ఫీ దిగడానికి యత్నించిన ఓ యువతిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మీడియా కథనాల ప్రకారం.. రైలు ప్రమాదంలో మృతిచెందిన మహిళ తన కుమారుడు చదువుకునే పాఠశాలకు సమీపంలో ట్రైన్ ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ పై 1930లో నిర్మించిన ‘ఎంప్రెస్’ అని పిలవబడే స్టీమ్ రైలు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఈ ట్రైన్ ప్రయాణిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడి ఆ రైలుతో ఫోటోలు, సెల్పీలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు.

ఈ క్రమంలోనే హిడాల్గో సమీపం వద్ద ఈ స్టీమ్ రైలును చూసేందుకు అనేక మంది తరలి రాగా తన కుమారుడితో పాటు మృతి చెందిన మహిళ కూడా వచ్చారు. అయితే అత్యుత్సాహంతో ఆమె ట్రాక్ కు సమీపంలో నిలబడి ట్రైన్ తో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించింది. వెనుక వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన ట్రైన్ ఆమెను ఢీకొట్టింది. మహిళ తల భాగాన్ని రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో రెప్పపాటులో ఆ మహిళ కుప్పకూలి పోయింది. అందరూ చూస్తుండగానే ప్రాణాలు విండిచింది. దీంతో అప్పటి వరకు అక్కడ ఉన్న ఉల్లాసభరిత వాతావరంణం ఒక్కసారిగా విషాదంగా మారింది. కళ్ల ముందే యువతి ప్రాణాలు కోల్పోవడంతో అంతా విషాదంలో మునిగిపోయారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş