iDreamPost
android-app
ios-app

యువకుడితో ప్రేమ ఇంట్లో తెలిసి.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని..

ప్రేమను దక్కించుకోలేక ఓ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో దానికి వారు ఒప్పుకోలేదు. దీంతో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

ప్రేమను దక్కించుకోలేక ఓ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో దానికి వారు ఒప్పుకోలేదు. దీంతో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

యువకుడితో ప్రేమ ఇంట్లో తెలిసి.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని..

లవ్.. ఒక పర్సన్ మీద ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమంటే ఇద్దరి మనసుల కలయిక. పరిచయాలు కాస్త ప్రేమలుగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకుంటారు. ప్రేమ లోకంలో మునిగి తేలుతుంటారు. గాఢమైన ప్రేమలో మునిగి విహరిస్తుంటారు. కాల్స్, చాటింగ్స్ తో ప్రియురాలు లేదా ప్రియుడితో గంటలకొద్ది గడిపేస్తుంటారు. తమకు ఇష్టమైన వారి నుంచి రిప్లై రాకపోతే విలవిల్లాడిపోతుంటారు. ఎలాగైనా తమ ప్రేమను గెలిపించుకోవాలని ఆరాటపడుతుంటారు యువతీ యువకులు. ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంటారు. ప్రేమించిన వారిని దక్కించుకునేందుకు పెద్దవాళ్లను ఎదిరించేందుకు కూడా వెనకాడరు. కొందరు ఇంట్లో వాళ్లను ఒప్పించి ప్రేమ పెళ్లిల్లు చేసుకుంటారు.

మరి కొందరు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోతే చంపడమో లేదా ప్రాణాలు తీసుకోవడమో చేస్తుంటారు. ప్రేమ సక్సెస్ అయితే అంతా బానే ఉంటుంది. ఫెయిల్ అయితే మాత్రం విషాదానికి దారితీసినట్టే అవుతుంది. ఇదే తరహాలో ఓ యువతి తన ప్రేమ గెలిపించుకోలేక ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఓ యువకుడిని ప్రేమించగా ఆ విషయం ఇంట్లో తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఆ తర్వాత తమ కూతురుకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడ్డం స్టార్ట్ చేశారు. ఓ పెళ్లి సంబంధం చూడగా దానికి సరే అని ఒప్పుకుంది. కానీ తన ప్రేమను మర్చిపోలేక.. ఇటు ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఆ యువతి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషాద ఘటన గజ్వేల్ మండలంలోని అనంతసాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతసాగర్ విలేజ్ కు చెందిన దాసరి కొండయ్య, మల్లమ్మకు ముగ్గురు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు అర్చన(18) గజ్వేల్‌ పట్టణంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. కాగా అర్చన ఇదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరి మనసులు కలిశాయి. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో అర్చన తను ఓ యువకుడిని ప్రేమిస్తున్న విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో తల్లిదండ్రులు కూతురును మందలించారు. ప్రేమ పెళ్లికి ససేమీరా అన్నారు. ఈనేపథ్యంలో అర్చనకు పెళ్లి చేయాలని పెళ్లి సంబంధం తీసుకొచ్చారు.

అయితే అయిష్టంగానే ఆ పెళ్లి సంబంధానికి అర్చన ఒప్పుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మానసిక వేధనకు గురైంది. ప్రేమను గెలిపించుకోలేని తాను జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లాక అర్చన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్చన మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ప్రేమ వ్యవహారమే తమ కూతురు ప్రాణం తీసిందని బోరున విలపించారు. కూతురి మృతిపై పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.