iDreamPost
android-app
ios-app

అమ్మాయిల మధ్య ప్రేమ! మగాడు లేని జీవితాన్ని పొందాలని!

  • Published Jun 08, 2024 | 1:23 PM Updated Updated Jun 08, 2024 | 1:23 PM

Two Women Fell in Love: ప్రేమకు కులం, మతం మాత్రమే కాదు జండర్ కూడా అవసరం లేదని యువతులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.. అలాగే యువకులు సైతం ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

Two Women Fell in Love: ప్రేమకు కులం, మతం మాత్రమే కాదు జండర్ కూడా అవసరం లేదని యువతులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.. అలాగే యువకులు సైతం ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

  • Published Jun 08, 2024 | 1:23 PMUpdated Jun 08, 2024 | 1:23 PM
అమ్మాయిల మధ్య ప్రేమ! మగాడు లేని జీవితాన్ని పొందాలని!

ఈ మధ్య కాలంలో యువత పెద్దలు కుదిర్చిన పెళ్లి కన్నా తాము మనస్ఫూర్తిగా ఇష్టపడ్డవారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.అబ్బాయి- అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణం.. కానీ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. ఇద్దరు యువతులు, ఇద్దరు మగవాళ్లు ప్రేమించుకొని సంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రేమ గుడ్డిది అంటారు.. అది నిజమే అని ఎన్నో ప్రేమ జంటలు నిరూపించాయి. ఇద్దరు యువతులు సోషల్ మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యారు.. ఆ పరిచయం ప్రేమగా మారి సృష్టికి విరుద్దంగా పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దలు అభ్యంతరం చెప్పడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మోద్గులగూడెం‌కు చెందిన కందిపాటి ఎల్లయ్య, మంగమ్మ దంపతుల కూతురు ఉమ(22)కు బయ్యారం మండలానికి చెందిన యువతి (21)తో ఆరు నెలల క్రితం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి తల్లిదండ్రులకు చెప్పకుండా  పెళ్లి కూడా చేసుకున్నారు.  ప్రస్తుతం ఇద్దరు హైదరాబాద్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

కొద్ది రోజుల క్రితం ఉమను ఆమె తల్లిదండ్రులు వెంటతీసుకొని వెళ్లారు. అంతేకాదు మరోసారి తమ కూతురు జోలికి రావొద్దని మరో యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పటి నుంచి ఒకరికొకరు దూరమై ఆ బాధ భరించలేకపోయారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన ఉమ ఈ నెల 1న ఎలుకల మందు తాగి.. మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రేమికురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పపడింది. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet