iDreamPost
android-app
ios-app

ఆ రూపంలో మహిళను వెంటాడిన మృత్యువు!

  • Published Sep 28, 2023 | 3:55 PM Updated Updated Sep 28, 2023 | 3:55 PM
  • Published Sep 28, 2023 | 3:55 PMUpdated Sep 28, 2023 | 3:55 PM
ఆ రూపంలో మహిళను వెంటాడిన మృత్యువు!

ఈ మద్య కాలంలో మనిషిని మృత్యువు ఎలా వెంటాడుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. గుండెపోటు, రోడ్డు ప్రమాదం, కరెంట్ షాక్, పాము కాటు తో మృత్యువడిలోకి చేరుకుంటున్నారు. దాంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఓ మహిళను మృత్యువు వెంటాడింది. ఈ ఘటన నర్సంపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన బండి మానస(30) నర్సంపేట మిషన్ భగీరథ ఆఫీస్ లో అటెండర్ గా విధులు నిర్వహిస్తుంది. ఈ నెల 14వ తేదీన రాత్రి సమయంలో మానసను పాము కాటు వేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎం కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న మానస పరిస్థితి పూర్తిగా విషమించి బుధవారం కన్నుమూసింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుటుంబానికి పెద్ద దిక్కు అయిన మానసను పాము రూపంలో మృత్యువు వెంటాడటంతో తీవ్ర విషాదం నెలకొంది. మానస మరణ వార్త విన్న గ్రామస్థులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కుటుంబీకులు ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwoongrandpashabetcasibomcasibomcasibombetcio giriş