వదిన పై కన్నేసిన మరిది! ఇలాంటి నీచుడిని ఎక్కడా చూసుండరు!

Chhattisgarh Crime News: ఈ మద్య మహిళలై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొంతమంది కామాంధులు స్త్రీ వ్యామోహంలో పడి ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు.

Chhattisgarh Crime News: ఈ మద్య మహిళలై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొంతమంది కామాంధులు స్త్రీ వ్యామోహంలో పడి ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు.

ఇటీవల దేశంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. డబ్బు, నగలు, ఆస్తుల కోసం సొంత వారినే హత్యలు చేస్తున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో మరికొన్ని జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. కొంతమంది కామాంధులు మహిళలపై వ్యామోహంతో ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. ఒంటరిగా మహిళలు కనిస్తే ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. కొంతమంది దుర్మార్గులు స్త్రీ వ్యామోహంతో సొంత వారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. వదినపై కన్నేసిన మరిది దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్  ఘటన వెలుగులోకి వచ్చింది. వదినపై వ్యామోహంతో నూనెతో మసాజ్ నెపంతో సొంత అన్నను హతమార్చి అనారోగ్యంతో చనిపోయాడని జనాలను నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు తమ్ముడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవర్దా జిల్లా కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగర్ గ్రామంలో పంచం సాయం పెద్ద కుమారుడు బిర్సు రామ్(33) తన భార్యా పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడు. పంచం సాయి చిన్న కుమారుడు భీమ్ సాయి తన అన్న భార్యపై కొంత కాలంగా వ్యామోహం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తరుచూ ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న బిర్సు రామ్ తమ్ముడిపై సీరియస్ అయ్యాడు. దీంతో అన్నపై కక్ష్య పెంచుకున్నాడు భీమ్ సాయి.

గత శుక్రవారం బిర్సు బాాగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అలాంటి సమయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భీమ్ సాయి తన అన్నకు నూనెతో మసాజ్ చేస్తానని చెప్పి గొంతు నులిమి చంపేశాడు. తన అన్న అనారోగ్యంతో అకస్మాత్తుగా కన్ను మూశాడని బంధువులు, గ్రామస్థులకు చెప్పాడు. వెంటనే అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు. గ్రామస్తులు బిర్సు మృతికి గల కారణాలను అడగగా భీమ్ సాయి సరైన సమాధానం చెప్పకుండా దాటవేయడంతో అతనిపై అనుమానాలు కలిగాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు బంధువులు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా అసలు నిజం వెల్లడించాడు. తాను వొదినను ఇష్టపడుతున్నానని.. ఇందుకు అన్న అడ్డు వస్తున్నాడన్న కారణంతో అతని అడ్డు తొలగించుకోవడానికి చంపేసినట్లు ఒప్పుకున్నాడు. కవార్ధా పోలీసులు క్రిమినల్ భీమ్ సాయిని సెక్షన్ 302 కింద అరెస్టు చేసి జైలుకు పంపారు.

Show comments