దారుణం: ఆ పని చేయలేదని గర్భిణీ భార్యకు నిప్పంటించిన భర్త!

ఓ గర్భిణి మహిళపై ఆమె భర్త దారుణానికి ఒడిగట్టాడు. జీవితాంతం తోడుగా ఉంటాడు అనుకున్న భర్తే.. కాలయముడిగా మారి.. ఆమెను కడతేర్చాడు. కేవలం తాను చెప్పిన పని చేయలేదని కారణంతో నిప్పటించి చంపేశాడు.

ఓ గర్భిణి మహిళపై ఆమె భర్త దారుణానికి ఒడిగట్టాడు. జీవితాంతం తోడుగా ఉంటాడు అనుకున్న భర్తే.. కాలయముడిగా మారి.. ఆమెను కడతేర్చాడు. కేవలం తాను చెప్పిన పని చేయలేదని కారణంతో నిప్పటించి చంపేశాడు.

నేటి సమాజంలో జరుగుతున్న ఘోరాలను చూస్తే.. అసలు మనుషులు అనే వారు ఉన్నారా అనే సందేహం రాక మానదు. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలతో కొందరు పశువుల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. ఇలా బయటనే అనుకుంటే.. ఆడపిల్లలకు సొంత ఇంట్లో కూడా కొన్ని రకాల వేధింపులు ఎదరవుతున్నాయి. ముఖ్యంగా కొందరు అత్తారింటి వాళ్లు కోడలకి నరకం చూపిస్తుంటారు. తాజాగా ఓ 23 ఏళ్ల గర్భిణీ యువతిని అత్తింటి వారు నిప్పటించి చంపేశారు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

మధ్యప్రదేశ్  రాష్ట్రం రాజ్ గడ్ జిల్లాలో ఖుర్దు గ్రామానికి చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈయనకు రీనా అనే కుమార్తె ఉంది. ఆమెకు 19 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మిథున్ అనే వ్యక్తికి వివాహంతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రీనా పుట్టింటి వారు అల్లుడికి వారి స్థాయి మేరకు కట్నం ఇచ్చుకున్నారు. ఇక పెళ్లైన తరువాత కొంతకాలం రీనా, మిథున్ దంపతులు సంతోషంగా సంసారా జీవితాన్ని గడిపారు. ఈ క్రమంలోనే వారికి ఆ బిడ్డ కూడా జన్మించింది. ప్రస్తుతం రీనాకు 23 ఏళ్లు.. అలానే మరోసారి గర్భందాల్చింది. ఈక్రమంలోనే అత్తింటి వారు రీనాను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశారు. రీనా భర్త, అత్తామామలు పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని నరకం చూపించారు.

అంతేకాక పలు సందర్భాల్లో ఆమెపై భౌతిక దాడి కూడా చేశారు. గర్భంతో ఉందని తెలిసి కూడా కనీకరికరం చూపకుండా పశువుల్లా ప్రవర్తించారు. ఇంకా చెప్పాలంటే..ఆమె చుట్టు రాబందులుగా చేరి..పీకుతున్నారు. ఈక్రమంలోనే రీనా ఇంధనం చల్లి నిప్పటించారు. ఇక ఆమె మంటలకు తాళలేక కేకలు పెట్టింది. స్థానికులు గుర్తించి వెంటనే ఆమె తండ్రికీ సమాచారం అందించారు. అంతేకాక ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పడికే జరగాల్సిన నష్టం జరిగింది.

గర్భిణీగా ఉన్న రీనా ప్రాణాలతో కొట్టుకుని మరణించింది.  ఇక కాలిన స్థితిలో ఉన్న తన కుమార్తె మృతదేహాన్ని చూసిన ఆమె తండ్రి రాంప్రసాద్ గుండెలు పగిలేలా రోధించాడు. తన బిడ్డ చావుకు కారణమైన తన అల్లుడి కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలనే కోరాడు. గర్భిణి అని కనికరం లేకుండా ఇంతటి దారుణానికి పాల్పడటంపై  స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇలా వరకట్న వేధింపులకు అనేక మంది మహిళలు బలయ్యారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఇంకా పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Show comments