iDreamPost

ఆమె ముగ్గురు పిల్లల తల్లి! కడుపు బంధాన్ని తెంపుకుని, ప్రియుడితో!

విక్రమ్ కుమార్, పూజా దేవి భార్యా భర్తలు. పెళ్లై 15 ఏళ్లు గడుస్తుంది. వీరి బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే ఇటీవల భార్య తీరులో మార్పులు సంతరించుకుంటున్నాయి.

విక్రమ్ కుమార్, పూజా దేవి భార్యా భర్తలు. పెళ్లై 15 ఏళ్లు గడుస్తుంది. వీరి బంధానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే ఇటీవల భార్య తీరులో మార్పులు సంతరించుకుంటున్నాయి.

ఆమె ముగ్గురు పిల్లల తల్లి! కడుపు బంధాన్ని తెంపుకుని, ప్రియుడితో!

పెళ్లికి ముందు ఎంత మందిని ప్రేమించినా పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కానీ..పెళ్లయ్యాక మాత్రం భార్యకు ఓ భర్త, సతికి ఓ పతి ఉండటం ధర్మం, న్యాయం. ఈ ధర్మమే వివాహ బంధాన్ని నిలబెడుతుంది. తన భర్త శ్రీరామ చంద్రుడిలా ఉండాలని ప్రతి భార్య కోరుకున్నట్లే.. భర్త కూడా తన భార్యకు తానే లోకం కావాలని కోరుకుంటాడు. ఆమె కళ్లల్లో ఆనందం కోసం ఎంతటి సాహసమైనా చేస్తాడు. కోరిందల్లా కొనిపెడుతూ.. ఆమె మనస్సును గెలుచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ కొన్ని సార్లు భర్త నిర్లక్ష్యం, కుటుంబం కోసం కష్టపడటాన్ని చేతకాని తనంగా తీసుకుంటున్నారు కొంత మంది మహిళలు. అతడు ప్రేమగా చూడటం లేదని బాధపడుతుంటారు. ఆ సమయంలో కొన్ని సానుభూతి మాటలు మాట్లాడినా లేదంటే పాత బాయ్ ఫ్రెండ్ మళ్లీ టచ్‌లోకి వచ్చినా అతడితో అన్ని విషయాలు పంచుకుంటారు. అలా దగ్గరైపోతుంటారు

ఇటీవల కాలంలో కొంత మంది మహిళలు భర్తను కాదని పర పురుషుడి స్వాంతన కోరుకుంటున్నారు. తన భర్త దగ్గర దొరకని ఆనందం, ప్రేమ మరొకరితో వెతుక్కుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన మహిళ సీమా హైదర్.. ఇండియా అబ్బాయి సచిన్ కోసం.. భర్తను వదిలేసి.. పిలల్ని తీసుకుని ఇక్కడకు వచ్చి ప్రేమికుడితో సెటిల్ అయిపోయిన సంగతి విదితమే. ఇప్పుడు మన నారీమణి మాత్రం.. ప్రియుడి కోసం భర్తను మాత్రమే కాదు.. పిల్లల్ని కూడా అతడికే వదిలేసి వెళ్లిపోయింది. లవర్ కోసం ముగ్గురు పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయింది మహా ఇల్లాలు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాలోని నాథ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్గా చౌక్‌కు చెందిన విక్రమ్ కుమార్ తంతి అనే వ్యక్తికి మురార్‌పూర్‌ గ్రామానికి చెందిన శ్రీరామ్‌ తంతి కుమార్తె పూజాదేవితో 2009లో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. కాగా, ఆమె కొన్ని రోజుల నుండి మొహద్దిపూర్ గ్రామానికి చెందిన సన్నీ తంతి అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇది వివాహేతర బంధానికి దారి తీసింది. అతడిని విడిచి ఉండలేకపోయింది ప్రియురాలు. తమ బంధాన్ని ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోరు కనుక.. ఎక్కడైనా పారిపోవాలని భావించారు లవర్స్. పిల్లలు అడ్డు అని భావించి.. కడుపు బంధాన్ని తెచ్చుకుంది.  ముగ్గురు పిల్లలను భర్తకు వదిలేసి ప్రియుడితో జంప్ అయిపోయింది ప్రేయసి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. కాగా, అటు సన్నీ తంతి బంధువులు కూడా పోలీసు కంప్లయింట్ చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి