iDreamPost
android-app
ios-app

ప్రేయసితో పెళ్లికి ఒప్పుకోవడం లేదని బాలుడి దారుణం.. తల్లిదండ్రులతో పాటు సోదరుడి హత్య..

  • Published Jul 11, 2024 | 7:00 AM Updated Updated Jul 11, 2024 | 7:00 AM

బాలుడి ప్రేమ కుటుంబాన్ని బలిగొన్నది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. కన్న తల్లిదండ్రులను సోదరుడిని హత్య చేశాడు.

బాలుడి ప్రేమ కుటుంబాన్ని బలిగొన్నది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. కన్న తల్లిదండ్రులను సోదరుడిని హత్య చేశాడు.

  • Published Jul 11, 2024 | 7:00 AMUpdated Jul 11, 2024 | 7:00 AM
ప్రేయసితో పెళ్లికి ఒప్పుకోవడం లేదని బాలుడి దారుణం.. తల్లిదండ్రులతో పాటు సోదరుడి హత్య..

ఇటీవలి కాలంలో ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమించిన అమ్మాయి దక్కదన్న కారణంతో ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. లవ్ లో ఫెయిలైతే ప్రాణాలను తీసుకుంటున్నారు. రోజు ఏదో ఒక చోట ప్రేమ పేరుతో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ పూర్తిగా అడ్డుకట్టపడడం లేదు. ఈ క్రమంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడు తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

యూపీలో ఓ 15 ఏళ్ల బాలుడు గత రెండేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియురాలితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులను, సోదరుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. తండ్రి మున్షి బింద్(45),తల్లి దేవంతి బింద్(40) , అతని అన్నయ్య ఆశిష్ బింద్(20) గొంతుకోసి ప్రాణాలు తీశాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. హత్యలు చేసినట్లు బాలుడు అంగీకరించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలు చేసేందుకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జులై 7న నిందితుడైన బాలుడు తన అన్న ఆశిష్‌తో గ్రామంలో ప్రీ వెడ్డింగ్ ఫంక్ష,న్ ఆర్కెస్ట్రా చూసేందుకు వెళ్లాడు. రాత్రి 11 ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చారు. అంతా నిద్ర పోతున్న సమయంలో మద్యం సేవించి తండ్రి, తల్లి, సోదరుడి గొంతు కోశాడు. నేరం తన మీదికి రాకుండా పథకం వేశాడు. తన తల్లిదండ్రులను అన్నను ఎవరో చంపారని నమ్మిచే ప్రయత్నం చేశాడు. తమ గ్రామానిక చెందిన వారే ఈ హత్యలు చేసినట్టు నిందితుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేయగా అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. బాలుడే కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు తేలింది. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş