Pune Bhushi Dam: వీడియో: జలపాతం అందాలు చూసేందుకు వెళ్లారు.. అంతలోనే..

వీడియో: జలపాతం అందాలు చూసేందుకు వెళ్లారు.. అంతలోనే..

Pune Bhushi Dam: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Pune Bhushi Dam: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు దంచి కొట్టాయి. అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లలేదు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యాయి. మే నెల నుంచి అనూహ్యంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి.పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా డ్యాములు, కెనాల్స్, చెరువులు, జలపాతాలు కల కలలాడుతున్నాయి. పర్యాటకులు వాటి అందాలు తమ కెమెరాల్లో బంధించేందుకు క్యూ కడుతున్నారు. జలపాతాల వద్ద కొన్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రకృతి ప్రేమికులు వాటిని చూసి ఆనందించేందుకు ఇష్టపడుతుంటారు. అలా వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా జలపాతం చూసేందుకు వెళ్లిని ఐదుగురిని ఊహించని వరద ముంచేసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్ర లోని పూణేలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వరదలో కొట్టుకుపోయిన వారిలో ముగ్గురి మృత దేహాలు వెలికి తీయగా..మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని పూణే ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ ధృవీకరించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిన్న ఆదివారం సెలవు కావడంతో పూణేలోని లోనావాలో ఉన్న భూషీ డ్యామ్ జలపాతం వద్దకు పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలోనే భూషీ డ్యామ్ చూసేందుకు వచ్చిన ఐదుగురు అనుకోకుండా వరద నీటిలో చిక్కుకొని మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తుంది. మృతుల్లో ఒక మహిళ, నలుగురు పిల్లలు ఉన్నారు. ఒకేసారి వరద నీరు చుట్టు ముట్టడంతో నీటి మధ్యలో చిక్కుకొని ఆర్తనాదాలు చేశారు. అక్కడే ఉన్న కొంతమంది పర్యాటకులు వారిని రక్షించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వరదలో కొట్టుకుపోయిన 36 ఏళ్ల మహిళ, 13 ఏళ్లు, 8 ఏళ్ల బాలికను వెలికితీశారు. మిగతా ఇద్దరి కోసం రెస్క్యూటీమ్ గాలిస్తున్నట్లు పూణె ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు.

Show comments