iDreamPost
android-app
ios-app

కామారెడ్డిలో దారుణం.. UKG విద్యార్థినిపై టీచర్‌ పైశాచికత్వం!

  • Published Sep 24, 2024 | 5:47 PM Updated Updated Sep 24, 2024 | 5:47 PM

Jeevadhan School, Kamareddy, PET Teacher: కామారెడ్డిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై టీచర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడన్న వార్త జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటన గురించి వివరాలు ఇలా ఉన్నాయి..

Jeevadhan School, Kamareddy, PET Teacher: కామారెడ్డిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై టీచర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడన్న వార్త జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటన గురించి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Sep 24, 2024 | 5:47 PMUpdated Sep 24, 2024 | 5:47 PM
కామారెడ్డిలో దారుణం.. UKG విద్యార్థినిపై టీచర్‌ పైశాచికత్వం!

కామంతో కళ్లు ముసుకుపోయిన మృగాళ్ల కామ దాహానికి అభంశుభం తెలియని చిన్నారులు కూడా బలవుతున్నారు. కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన ఒకవైపు దేశాన్ని కుదిపేస్తున్న క్రమంలోనే ఇప్పుడు తెలంగాణలోని కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. యూకేజీ చదువుతున్న చిన్నారిపై పీఈటీ టీచర్‌గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

కామారెడ్డిలోని జీవధాన్‌ హైస్కూల్‌లో నాగరాజు పీఈటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల విద్యార్థిని ఒంటరిగా ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో.. కుటుంబ సభ్యులు స్కూల్‌కి వచ్చి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. పీఈటీ నాగరాజు ఇక్కడ లేడని, విషయం తమకు తేలియదని వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. విద్యార్థిని కుటుంబ సభ్యులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. వారికి విద్యార్థి సంఘాల నాయకులు కూడా మద్దుత ఇవ్వడంతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు.. పాఠశాలకు చేరుకొని, విషయ​ం తెలుసుకొని.. కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు.

కానీ, చిన్నారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమకు న్యాయం కావాలని, ఆ దుర్మార్గుడిని తమకు అప్పగించాలని, అతను ఎక్కడున్నాడో పాఠశాల మేనేజ్‌మెంట్‌కు, ఇతర టీచర్లకు తెలుసని, వాళ్లే అతన్ని దాచిపెడుతున్నారంటూ.. మండిపడ్డారు. విద్యార్థి సంఘాల వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. అయితే.. అభంశుభం తెలియని చిన్నారులపై పాఠశాలలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే.. పిల్లాల్ని స్కూల్‌కు ఎలా పంపాలంటూ మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళనలో భాగం అయ్యారు. నాగరాజుపై విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి, పోక్స్‌ కేసు కూడా నమోదు చేస్తామంటూ పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ ఒక్క విద్యార్థిని మీదే అఘాయిత్యానికి పాల్పడ్డాడా? ఇంకా ఎంత మందిని ఇలా చేశాడు? అతని దారుణాలు ఎంత కాలంగా సాగుతున్నాయో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.