iDreamPost
android-app
ios-app

వనపర్తిలో విషాదం.. ప్రాణం తీసిన ఎగ్ బజ్జీ.. అసలేం జరిగిందంటే?

  • Published Mar 01, 2024 | 12:22 PM Updated Updated Mar 01, 2024 | 1:44 PM

ఆకలి తీర్చుకునేందుకు ఎగ్ బజ్జీ తిందామనుకుంటే.. అదే అతడి ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాడు. ఈ విషాద ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఆకలి తీర్చుకునేందుకు ఎగ్ బజ్జీ తిందామనుకుంటే.. అదే అతడి ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాడు. ఈ విషాద ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

  • Published Mar 01, 2024 | 12:22 PMUpdated Mar 01, 2024 | 1:44 PM
వనపర్తిలో విషాదం.. ప్రాణం తీసిన ఎగ్ బజ్జీ.. అసలేం జరిగిందంటే?

ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ హాయిగా గడిపిన వాళ్లు హఠాత్తుగా మృత్యువాత పడుతుంటారు. తమతో ఆనందంగా గడిపిన వారు అంతలోనే అనంతలోకాలకు వెల్లడంతో తీవ్ర శోకంలో మునిగిపోతారు కుటుంబ సభ్యులు. గ్రహచారం బాగాలేకపోతే మంచినీళ్లు కూడా గొంతులో అడ్డుపడి ప్రాణాలు పోతాయంటుంటారు. ఇదే విధంగా ఎగ్ బజ్జీ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. తనకు ఎంతో ఇష్టమైన ఎగ్ బజ్జీని తింటూ అతడు మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ విషాద ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. జిల్లాలోని మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామానికి చెందిన దాసరి తిరుపతయ్య(39) అనే వ్యక్తి ఇంటి వద్ద ఎగ్ బజ్జీ తింటూ ప్రమాదానికి గురయ్యాడు.

ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో గుడ్డు ఇరుక్కుంది. దీంతో ఆ గుడ్డును కక్కలేక మింగలేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడకపోవడంతో చూస్తుండగానే తిరుపతయ్య ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే తిరుపతయ్య మరణించడంతో భార్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా మృతుడు తిరుపతయ్యకు భార్య సువర్ణ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. తిరుపతయ్య చేపల వేటతో పాటు హమాలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom