iDreamPost
android-app
ios-app

జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం! 36 మంది మృతి

  • Published Nov 15, 2023 | 3:00 PM Updated Updated Nov 15, 2023 | 3:00 PM

జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ప్రమాద దృష్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ప్రమాద దృష్యాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

  • Published Nov 15, 2023 | 3:00 PMUpdated Nov 15, 2023 | 3:00 PM
జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం! 36 మంది మృతి

ఊహించని రీతిలో అతి భయంకరమైన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. కాసేపట్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటామనంగా ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 36మంది దుర్మరణం చెందగా 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జమ్మూకశ్మీర్ లో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం భయానకంగా మారింది. ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ బస్సు ప్రమాదం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఊహించలేము. మరీ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అప్పటి వరకు తమతో ఉన్న వాళ్లు విగత జీవులుగా మారడంతో గుండెలవిసేలా రోదిస్తారు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను ఎక్కించుకుని కిష్త్వాడ్ నుంచి జమ్మూ బయలుదేరిన బస్సు మార్గమద్యలో లోయలో పడిపోయింది. డోడా జిల్లాలో బటోత్- కిష్త్వాడ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోయలో పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు హెలికాఫ్టర్ సేవలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet