Dharani
టీచర్ తో ప్రేమాయాణం నడిపాడు ఓ యువకుడు. చివరకు ఆ టీచర్ వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..
టీచర్ తో ప్రేమాయాణం నడిపాడు ఓ యువకుడు. చివరకు ఆ టీచర్ వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..
Dharani
మన సమాజంలో టీచర్ కు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. తల్లి, తండ్రి తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకే ఇచ్చారు. టీచర్ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. ఎందుకంటే.. తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. వారిని గొప్ప వారిగా తీర్చిదిద్దేది టీచరే అని నమ్ముతారు. అయితే మారుతున్న కాలంతో పాటుగా సమాజంలో కొన్ని విపరీత ధోరణలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులను కన్న బిడ్డలుగా భావించి.. వారికి విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు.. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కీచక ఉపాధ్యాయుల గురించే విన్నాము. కానీ ఇప్పుడు ఓ ఉపాధ్యాయురాలు ఈ జాబితాలో చేరింది. విద్యార్థితో ప్రేమాయణం కొనసాగించడమే కాక.. చివరకు.. అతడు ఆత్మహత్య చేసుకునేందుకు కారణం అయ్యింది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్, ఇండోర్ లో చోటు చేసుకుంది. ఓ మహిళా టీచర్.. యువకుడితో కొన్ని నెలల పాటు ప్రేమాయణం కొనసాగించింది. ఆ తర్వాత అతడిపై రేప్ కేసు పెట్టింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చివరికి వారిద్దరి మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్ చాట్ బయటికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్, ఇండోర్‌కు చెందిన గౌరవ్ అనే 19 ఏళ్ల యువకుడు బీఫార్మసీ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడికి తన ఇంగ్లీష్ టీచర్ గౌరి తివారీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇక గత 11 నెలలుగా వారు ప్రేమించుకుంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. తాజాగా గౌరి.. గౌరవ్ మీద రేప్ కేసు పెట్టింది. దాంతో ఇండోర్ పోలీసులు గౌరవ్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాక కేసు విత్ డ్రా చేసుకునేందుకు పోలీసులు రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు గౌరవ్ తండ్రి తెలిపారు. అయితే తాము రూ.45 వేలు చెల్లించి తమ కుమారుడిని జైలు నుంచి విడిపించి తీసుకొచ్చామని చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన గౌరవ్.. రూంలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. ఆ తర్వాత ఎంతకి తిరిగి బయటికి రాలేదు. దాంతో అనుమానం వచ్చిన గౌరవ్ చెల్లి.. అన్న రూమ్ లోకి వెళ్లి చూడగా.. గౌరవ్ ఉరి వేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు అతడిని దగ్గర్లోని ఎంవై ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. పోస్ట్ మార్టం తర్వాత.. కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని మహిళా పోలీస్ స్టేషన్ ముందు ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఆ స్టేషన్ సీఐ కౌశల్య చౌహాన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అయితే గౌరవ్ తనను బెదిరించాడని సదరు ఇంగ్లీష్ టీచర్ ఆరోపించింది. తాము ఇద్దరం ప్రైవేటుగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని గౌరవ్ చెప్పాడని పేర్కొంది. అయితే ఆమె చేసిన ఆరోపణలను గౌరవ్ తండ్రి ఖండించాడు. ఆమె తన కుమారుడిని డబ్బులు ఇవ్వాలని బెదిరించిందని.. పేర్కొన్నాడు. ఆమె వేధింపులు తాళలేక తన కుమారుడు ఇంట్లో డబ్బులు దొంగిలిస్తూ పట్టుబడ్డాడని చెప్పుకొచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.