iDreamPost
android-app
ios-app

అన్నమయ్య జిల్లా: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం..

  • Published Sep 15, 2023 | 8:56 AM Updated Updated Sep 15, 2023 | 8:56 AM
  • Published Sep 15, 2023 | 8:56 AMUpdated Sep 15, 2023 | 8:56 AM
అన్నమయ్య జిల్లా: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం..

వారంతా కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకునేందుకు.. తిరుమల వెళ్లారు. దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. మృత్యువు వారిని పలకరించింది. దైవ దర్శనం కోసం ఇంటి నుంచి వెళ్లిన వారు.. అటునుంచి అటే.. దేవుడి దగ్గరకు వెళ్లారు. దాంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. మృతి చెందిన వారిని తలచుకుని.. బాధిత కుటుంబీకులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌, అన్నమయ్య జిల్లాల్లో చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున.. 3 గంటల ప్రాంతంలో.. కేవీపల్లి మండలం, మఠంపల్లి వద్ద యాక్సిడెంట్‌ జరిగింది. తుఫాన్‌ వాహనం-లారీ ఒకదానికొకటి ఢీకొట్టుకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 11 మందికి గాయాలు అయ్యాయి.

బాధితులు.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనం అనంతరం స్వగ్రామమైన అత్తినికి వెళుతుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ వారిని వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తలరించారు. వాహనంలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş