iDreamPost
android-app
ios-app

ముగ్గురు భర్తల ముద్దుల భార్య కథ.. ఒకరికి తెలియకుండా మరొకరితో!

  • Published Aug 02, 2024 | 4:09 PM Updated Updated Aug 02, 2024 | 4:09 PM

రోహిత్, ప్రియాంక గౌడలకు సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. ఆమె కోటీశ్వరురాలు కాగా, అతడు ఓ ఎలక్ట్రీషియన్. ఇన్ స్టా వేదికగా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. అప్పుడో ట్విస్ట్ బయటకు వచ్చింది.

రోహిత్, ప్రియాంక గౌడలకు సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. ఆమె కోటీశ్వరురాలు కాగా, అతడు ఓ ఎలక్ట్రీషియన్. ఇన్ స్టా వేదికగా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. అప్పుడో ట్విస్ట్ బయటకు వచ్చింది.

  • Published Aug 02, 2024 | 4:09 PMUpdated Aug 02, 2024 | 4:09 PM
ముగ్గురు భర్తల ముద్దుల భార్య కథ.. ఒకరికి తెలియకుండా మరొకరితో!

ఈ మధ్య సోషల్ మీడియా ప్రేమ కథలకు కొదవ లేదు. వాట్సప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ ద్వారా ఇండియన్ బాయ్స్‌తో ఏర్పడిన పరిచయం.. భర్తను వదిలేసి పిల్లలతో సహా ప్రేమించిన ప్రియుడి కోసం భారత్‌కు వస్తున్నారు విదేశీ మహిళలు. ఇలాంటి తరహా ప్రేమ కహనీలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అయితే ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ మాత్రం ఒక్కరితో కాదు ఏకంగా ముగ్గురు అబ్బాయిల జీవితాలతో మూడు ముక్కలాట ఆడింది. ఇద్దర్ని పెళ్లి చేసుకున్నాక మూడో వ్యక్తికి కూడా ఆమె గుండెలో స్థానం కల్పించిన విశాల హృదయురాలు. ఇప్పుడు సోషల్ మీడియాలో పరిచమైన మరో వ్యక్తి కోసం రెండో భర్తను కూడా వదిలేసి.. మూడో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ముగ్గురు మొగుళ్ల ముద్దుల భార్య కథ ఏంటో తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన ప్రియాంక గౌడ సహా బెళగావికి చెందిన రోహిత్ హోల్కర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రోహిత్ ఎలక్ట్రీషియన్. ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమకు, పెళ్లికి దారి తీసింది. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. అప్పుడో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆమెకు ఇది తొలి పెళ్లి కాదని తేలింది. రెండో భర్త సుధాకర్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా లవ్ స్టోరీ కాస్త ట్రాజెడీగా మారింది. ప్రియాంక గౌడ తనను మోసం చేసి మరో యువకుడ్ని పెళ్లి చేసుకుందని శిడ్లఘాట్‌లో ఫిర్యాదు చేశాడు . అయితే ప్రియాంక గౌడ కాదని వాదిస్తుంది. కోట్లాది రూపాయల ఆస్తి ఉండటంతో తనను బావ సుదాకర్, అతని తండ్రి వేధిస్తున్నారని పేర్కొంది ప్రియాకం గౌడ. తన తల్లిదండ్రులు చనిపోవడంతో సుధాకర్ ఫ్యామిలీ ఆదుకుందని, ఆస్తి కొట్టేయాలని టార్చర్ పెట్టారంటూ చెప్పుకొచ్చింది.

ఈ టార్చర్ తట్టుకోలేక.. ప్రియుడి కోసం వచ్చేసి.. గుడిలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అనంతరం పోలీసులను ఆశ్రయించడంతో ఆమెకు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అయితే ఈ ఘటనలో మీడియా సపోర్టు కూడా తీసుకుంది ప్రియాంక గౌడ్. రెండో భర్త అని చెప్పుకుంటున్న సుధాకర్ ఎంట్రీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రియాంక తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పుకొచ్చాడు రెండో భర్త. ఆమెకు చిక్కబళ్లాపూర్‌కు చెందిన మునిరాజుతో గతంలో వివాహమైందని వెల్లడించారు. ఆ తర్వాత తనను వివాహం చేసుకుందని చెబుతున్నాడు. ఆ తర్వాత రోహిత్ అనే వ్యక్తిని ప్రేమిచి పెళ్లి చేసుకుందని చెప్పాడు. మొత్తానికి ఈ కథలో ఎవరిరీ తప్పో, ఒప్పో తెలియక తల పీక్కుంటున్న పరిస్థితి స్థానిక పోలీసులది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet