Dharani
Dharani
మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు చూస్తే.. ఆశ్చర్యం, కోపం ఇలా అన్ని ఫీలింగ్స్ ఒకేసారి కలుగుతాయి. ఏమాత్రం ఆలోచన ఉండదా అనిపించకమానదు. తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకున్న సంఘటన చూస్తే.. మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. తల్లిదండ్రులు కష్టపడి అతడిని ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో తమ బిడ్డ డాక్టర్‌గా తిరిగి వస్తాడని ఆశిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు. అయితే వారి కలలు కల్లలు అయ్యాయి. డాక్టర్ అయ్యి.. పేషెంట్లను చూడాల్సిన వ్యక్తి కాస్త.. అర్థం లేని భయం కారణంగా.. అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం నాడు చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న దీక్షిత్ రెడ్డి అనే విద్యార్థి మర్మాంగం కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన నివాసంలోనే దీక్షిత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
దీక్షిత్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా, దేవరుప్పుల గ్రామం. అతడి తల్లిదండ్రులు సోమిరెడ్డి, కరుణ. దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు సుమారు 20 ఏళ్ల క్రితం వరంగల్ నుంచి హైదరాబాద్ శివారు పాపిరెడ్డి నగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. దీక్షిత్ రెడ్డికి సోదరి కూడా ఉంది. అతడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీక్షిత్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. దాంతో మాత్రలు వాడుతున్నాడు. అయితే ఎంబీబీస్ చదువుతున్న తాను ఇలా మందులు వాడటం ఏంటని బాధపడుతుండేవాడు. ఆ కారణంగానే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. ఇక దీక్షిత్ రెడ్డి గతంలో కూడా ఒకసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు గమనించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.