iDreamPost
android-app
ios-app

“బేబీ” చిత్రంపై హైదరాబాద్ సీపీ ఆనంద్ ఫైర్!

  • Published Sep 14, 2023 | 6:44 PM Updated Updated Sep 14, 2023 | 6:44 PM
  • Published Sep 14, 2023 | 6:44 PMUpdated Sep 14, 2023 | 6:44 PM
“బేబీ” చిత్రంపై హైదరాబాద్ సీపీ ఆనంద్ ఫైర్!

యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. ఇందులో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కలిసి నటించారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ.. ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక నిర్మాతగా వ్యవహరించిన ఎస్ కేఎన్ కు ఈ సక్సెస్ భారీ లాభాన్నే తీసుకొచ్చింది. అయితే విజయానందంలో మునిగితేలుతున్న ఈ మూవీ యూనిట్ కు హైదరాబాద్ సీపీ ఆనంద్ గట్టి షాక్ ఇచ్చారు. బేబీ మూవీపై స్పందించిన ఆయన ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బేబీ చిత్రంలో డ్రగ్స్ ను ప్రోత్సహించేలా చాలా సీన్లు ఉన్నాయని ఆయన సీరియస్ అయ్యారు. ఇక ఫ్రెష్ లివింగ్ ఆపార్ట్ మెంట్ రైడ్ నిర్వహించిన తరహాలోనే బేబీ చిత్రంలో చాలా రకాల సన్నివేశాలు ఉన్నాయని మండిపడ్డారు. ఇక ఈ మూవీ యూనిట్ సభ్యులకు నోటీసులు కూడా జారీ చేస్తామని కూడా ఆయన అన్నారు. ఇదే కాకుండా ఇప్పటి నుంచి అన్ని సినిమాలపై కాస్త కన్నేసి ఉంచుతామని హైదరాబాద్ సీపీ ఆనంద్ తాజాగా తెలిపారు. నగర సీపీ కామెంట్స్ తో బేబీ చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ గురైంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss