పేరుకే స్పా సెంటర్.. లోపల అమ్మాయిలతో..!

హైదరాబాద్ బంజారాహిల్స్ లో కొందరు వ్యక్తులు పాడు పనులకు తెర లేపారు. నిరుద్యోగ అమ్మాయిలనే టార్గెట్ గా చేసుకుని గలీజ్ దందాకు శ్రీకారం చుట్టారు. ఇక పోలీసులకు అనుమానం రావడంతో వెంటనే ఆ స్పా సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు స్పా సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడంతో పాటు కొందరు యువతుల్ని రక్షించి రెస్క్యూ హెమ్ కు తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రాంతంలో సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి ఓ స్పా సెంటర్ పేరుతో ఓ దుకాణాన్ని తెరిచాడు. అయితే, పేరుకే ఇది స్పా సెంటర్.. లోపల మాత్రం అమ్మాయిలతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ అమ్మాయిలనే ఆసరాగా చేసుకుని వారితో ఈ గలీజ్ దందాను నడిపిస్తున్నారు. ఇక పోలీసులకు అనుమానం రావడంతో వెంటనే ఆ స్పా సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వకుడు సయ్యద్ బిలాల్ తో పాటు ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ఐదుగురు యువతులను రక్షించి రెస్క్యూ హెమ్ కు తరలించారు.

ఇది కూడా చదవండి: వీడు తండ్రి కాదు, రాక్షసుడు! కన్న పిల్లలని చూడకుండా!

Show comments