iDreamPost
android-app
ios-app

ఉద్యోగంలో బిజీగా ఉన్న భార్య.. తట్టుకోలేని భర్త దారుణం!

  • Published Oct 23, 2023 | 8:13 AM Updated Updated Oct 23, 2023 | 8:13 AM

ఈ యువతి చాలా ఏళ్ల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత పోలీస్ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. ఇక రాత్రి, పగలు ఉద్యోగంలో బిజీగా ఉండడంతో ఆమె భర్త తట్టుకోలేక దారుణానికి పాల్పడ్డాడు.

ఈ యువతి చాలా ఏళ్ల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత పోలీస్ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. ఇక రాత్రి, పగలు ఉద్యోగంలో బిజీగా ఉండడంతో ఆమె భర్త తట్టుకోలేక దారుణానికి పాల్పడ్డాడు.

  • Published Oct 23, 2023 | 8:13 AMUpdated Oct 23, 2023 | 8:13 AM
ఉద్యోగంలో బిజీగా ఉన్న భార్య.. తట్టుకోలేని భర్త దారుణం!

బిహార్ లోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు చాలా ఏళ్ల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత అతని భార్యకు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. ఇక భార్య రాత్రి, పగలు ఉద్యోగంలో బిజీగా ఉండడంతో భర్త తట్టుకోలేక దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆమె భర్త ఏం చేశాడు? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం..బిహార్ లోని జెహనాబాద్ లో గజేంద్రయాదవ్. శోభా కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు ఆరేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త ఓ కోచింగ్ సెంటర్ ను నడిపిస్తుండగా, భార్య కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఉద్యోగ విధుల్లో భాగంగా భార్య ఇంటికి ఆలస్యంగా రావడం, పైగా రాత్రి, పగలు తేడా లేకుండా ఉద్యోగానికి వెళ్తుండేది. దీంతో విధుల్లో పడి భార్య పట్టించుకోవడం లేదని ఆమెపై భర్త కోపంతో ఊగిపోయాడు. ఇదే విషయంపై భార్యాభర్తలు పలుమార్లు గొడవ కూడా పడ్డాడు.

ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన భర్త గజేంద్ర యాదవ్.. ఇంట్లో ఉన్న తుపాకీతో భార్య శోభాకుమారిని దారుణంగా కాల్చి చంపాడు. ఈ విషయం తెలుసుకుని మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet