iDreamPost
android-app
ios-app

ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థిని షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Feb 25, 2024 | 11:04 AM Updated Updated Feb 25, 2024 | 11:04 AM

తోటి విద్యార్థి ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ విద్యార్థిని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

తోటి విద్యార్థి ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ విద్యార్థిని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

  • Published Feb 25, 2024 | 11:04 AMUpdated Feb 25, 2024 | 11:04 AM
ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థిని షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే?

ఇటీవల ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడడం, వేధించడం ప్రేమకు ఒప్పుకోకపోతే ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు కొందరు ఆకతాయిలు. ప్రేమ మోజులో పడి బంగారం లాంటి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. కన్న వారి కలలను కాలరాస్తూ వారికి దుఖాన్ని మిగులుస్తున్నారు. ఇదే రీతిలో ఓ యువతి ప్రేమ పేరుతో పెడుతున్న వేధింపులను తట్టుకోలేక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తోటి విద్యార్థి వేధిస్తుండడంతో మనస్తాపానికి గురై పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన గుత్తి జంగయ్య, పద్మ దంపతుల కూతురు నవ్య ప్రేమ వేధింపులు తాళలేక తనువు చాలించింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఈ క్రమంలో తోటి విద్యార్థి కొమ్మగోని నందీశ్వర్‌ తనను ప్రేమించాలని వెంటపడుతూ నవ్యను వేధిస్తున్నాడు. ఇలా కొంత కాలం గడిచింది. ఇక చేసేదేం లేక నవ్య ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తమ కూతురు భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందిన వారు నందీశ్వర్‌ను తమ కూతరు వెంటపడడం మానుకోవాలని హెచ్చరించారు. అయినా అతడిలో మార్పురాలేదు. ప్రేమించాలని చెప్పి బాలిక ఇంటి చుట్టూ తిరుగుతూ మానసిక క్షోభకు గురిచేశాడు.

అంతేగాక నందీశ్వర్ తన క్లాస్‌మేట్‌ రాజేశ్‌తోపాటు మరోతోటి విద్యార్థిని సహకారంతో ఇన్‌స్ట్రాగామ్‌లో నవ్యను వేధించడం ప్రారంభించాడు. ప్రేమ పేరుతో నందీశ్వర్ పెట్టే వేధింపులు తాళలేక స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నవ్య ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి చూసేసరికి నవ్య ఉరేసుకుని కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో వారు గుండెలవిసేలా రోదించారు. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తూ అందుకు కారణమైన ముగ్గురు విద్యార్థులను విచారిస్తున్నారు పోలీసులు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet