iDreamPost
android-app
ios-app

ప్రియురాలి బర్త్ డే అని వెళితే.. చివరకు ఏం జరిగిందంటే..

  • Published Oct 29, 2024 | 2:38 PM Updated Updated Oct 29, 2024 | 2:38 PM

ప్రియురాలి పుట్టినరోజు ప్రియుడిపాలిట శాపంగా మారింది. బర్త్ డే విషెస్ చెప్పేందుకు వెళితే యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రియురాలి పుట్టినరోజు ప్రియుడిపాలిట శాపంగా మారింది. బర్త్ డే విషెస్ చెప్పేందుకు వెళితే యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • Published Oct 29, 2024 | 2:38 PMUpdated Oct 29, 2024 | 2:38 PM
ప్రియురాలి బర్త్ డే అని వెళితే.. చివరకు ఏం జరిగిందంటే..

అమ్మ ప్రాణం పోస్తుంది.. ప్రియురాలు ప్రాణం తీస్తుంది అనడంలో సందేహం లేదనిపిస్తోంది కొన్ని ఘటనలు చూస్తే. ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రేమించిన వారిని దక్కించుకునేందుకు దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రేమ కోసం చావడానికైనా.. చంపడానికైనా సిద్ధపడుతున్నారు. ప్రేమ పేరుతో లోబరుచుకుని మోసాలకు కూడా పాల్పడుతున్నారు. ప్రేయసి, లేదా ప్రియుడు పెళ్లికి నిరాకరిస్తున్నారని హత్యలు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇటీవల ప్రేమ కారణంగా యువతీ యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.

కన్న వారికి కడుపు కోత మిగిలిస్తున్నారు. పిల్లలే లోకంగా జీవించిన పేరెంట్స్ కు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. ఇదే రీతిలో ఓ యువకుడు ప్రేమ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా ఆమెక విషెస్ చెప్పేందుకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఆ యువకుడు యువతితో చనువుగా ఉండడం చూసిను ఆమె కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. యువతి బంధువులు దాడి చేయడంతో అవమానానికి లోనై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలు పిలిచిందని వెళితే ఏకంగా ప్రాణాలే పోయాయి. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సదాశివపేట మండలంలోని మాలపహాడ్ గ్రామానికి చెందిన మల్లగొని గొల్ల శంకరయ్య కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయన పెద్ద కుమారుడు రంజిత్ (19) పుల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో పుల్కల్ కు చెందిన వడ్డె నరసింహులు కూతురు రేణుక కూడా చదువుతుంది. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. రంజిత్, రేణుక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు రేణుక బర్త్ డే ఉండడంతో తనను కలిసి విషెస్ చెప్పాలని రంజిత్ ను కోరింది.

ప్రియురాలు పిలిచిందని రంజిత్ ఒంటరిగా రాత్రి వేళ టూవీలర్ పై పుల్కల్ గ్రామానికి వెళ్లాడు. రేణుకను కలిసి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ క్రమంలో రేణుకతో చనువుగా ఉండడం చూసిన కుటుంబ సభ్యులు రంజిత్ ను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. తమ కూతురును మరిచి పోవాలని యువకుడిని హెచ్చరించారు. ఇక ఇదే విషయాన్ని రంజిత్ తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు అక్కడికి చేరుకుని మాలపాడ్ కు తీసుకెళ్లి ఇంట్లో దింపి వెళ్లిపోయారు. ప్రేయసి బంధువుల దాడితో మనస్థాపం చెందిన రంజిత్ తనువు చాలించాలనుకున్నాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లి గ్రామం సమీపంలోని కుమ్మరి చెరువు వద్దకు వెళ్ళాడు. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సోమవారం చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు రంజిత్ మృత దేహాన్ని గుర్తించి తండ్రి శంకరయ్యకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రంజిత్ మృత దేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి పేరెంట్స్ గుండెలవిసేలా రోధించారు. తన కొడుకు మృతికి రేణుకనే కారణమని మృతుడు తండ్రి శంకరయ్య ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. యువకుడి ప్రాణం తీసిన బర్త్ డే ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet