iDreamPost
android-app
ios-app

షాకింగ్: ఆత్మహత్య చేసుకున్న మాజీ MLA కూతురు!

షాకింగ్: ఆత్మహత్య చేసుకున్న మాజీ MLA కూతురు!

ఈ మధ్యకాలంలో కొందరు అమ్మాయిలు ప్రతీ చిన్న విషయానికి సమస్యకు పరిష్కారం లేదన్నట్లుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న.. సినీ నటుడు విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో అన్ని సినీ పరిశ్రమలోని ప్రముఖులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో ఆయన కుటుం సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ బుర్హానపూర్ జిల్లాకు చెందిన చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర దాదు కూతురు పూజా దాదా (30) తాజాగా ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూజా దాదా ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అందరూ షాక్ గురవుతున్నారు.