Online Scam: 22 ఏళ్ల యువకుడి ఘరాన మోసం.. ఏకంగా 22 వేల కోట్లకు టోకరా

Online Trading Scam: పట్టుమని పాతికేళ్లు లేని యువకుడు.. ఏకంగా 22 వేల కోట్ల రూపాయలకు టోకరా వేశాడు. ఆ వివరాలు..

Online Trading Scam: పట్టుమని పాతికేళ్లు లేని యువకుడు.. ఏకంగా 22 వేల కోట్ల రూపాయలకు టోకరా వేశాడు. ఆ వివరాలు..

ఆన్లైన్ వేదికగా జరుగుతున్న మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు దీనిపై ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా.. నిందితులపై ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ కేటుగాళ్లు మారడం లేదు. పైగా నేటి కాలంలో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో తన లగ్జరీ లైఫ్ స్టైల్, హై ప్రొఫైల్ ఫొటోలతో జనాలను బురిడి కొట్టించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 వేల కోట్లకు టోకరా వేశాడు. అది కూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే. ఈ సంఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. ఆ వివరాలు..

ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఓ యువకుడు ఏకంగా రూ.22 వేల కోట్లను దోచేశాడు. విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించి.. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వందల మందికి టోకరా వేశాడు. ఈ క్రమంలో పోలీసులు 22 ఏళ్ల విశాల్ పుకాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అసోంకు చెందిన 22 ఏళ్ల విశాల్ పుకాన్ అనే యువకుడు తన లగ్జరీ లైఫ్‌స్టైల్, హై ఫ్రొఫైల్‌తో అసోం, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పలువుర్ని స్టాక్ మార్కెట్ పేరుతో ఆకర్షించి.. భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే.. కేవలం 60 రోజుల్లో 30 శాతం రాబడిని పొందొచ్చని ఇన్వెస్టర్లను ఆకర్షించి.. వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డాడు. అంతేకాక ఫార్మాస్యూటికల్స్, ప్రొడక్షన్, నిర్మాణ రంగాల్లో డొల్ల కంపెనీలు స్థాపించాడు. అసోం సినీ పరిశ్రమలోనూ పెట్టుబడులు పెట్టి.. అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించాడు.

ఇలా సాగుతున్న అతడి మోసాలు.. తాజాగా గువహటిలో ఓ స్టాక్ మార్కెట్ మోసానికి సంబంధించిన కేసు వెలుగు రావడంతో పుకాన్ బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది. గువహటి డిబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ యజమాని దీపాంకర్ బర్మన్ మిస్సింగ్ వ్యవహారంలో పుకాన్‌పై ఆరోపణలు రావడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. పుకాన్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి.

పుకాన్ సోషల్ మీడియా ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించి కోట్లలో మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో సెప్టెంబర్ 2 రాత్రి పుకాన్ ఇంటిపై పోలీసులు దాడి చేసి.. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్‌తో పాటు అతని మేనేజర్ బిప్లాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై నాన్- బెయిలబుల్ కేసు కింద కేసులు నమోదు చేశారు. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. పుకాన్ కేసుతో పాటు అన్ని ట్రేడింగ్ మోసాలపై సమగ్ర విచారణకు అసోం శర్మ ఆదేశించారు. ఆన్‌లైన్ స్టాక్‌ మార్కెట్ పెట్టుబడులు, ఇతర ట్రెడింగ్‌లు, మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Show comments