Krishna Kowshik
పెళ్లి అనగానే వరుడు కన్నా వధువుకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. భర్త తనను అర్థం చేసుకోవాలని, తన అభిప్రాయాలకు విలువనివ్వాలని ఆశపడుతుంది. కానీ
పెళ్లి అనగానే వరుడు కన్నా వధువుకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. భర్త తనను అర్థం చేసుకోవాలని, తన అభిప్రాయాలకు విలువనివ్వాలని ఆశపడుతుంది. కానీ
Krishna Kowshik
ఆడ పిల్లను బాగా చదివించి.. ఓ అయ్య చేతిలో పెడతాడు తండ్రి. కట్న కానుకలు ఇచ్చి.. ఘనంగా పెళ్లి చేస్తాడు. ఆమె జీవితం బాగుండాలని భారీగా పెట్టి పోతలు పెట్టి అత్తారింటికి సాగనంపుతాడు. అలాగే పెళ్లి కూతురు కూడా ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెడుతుంది. భర్త తనను అర్థం చేసుకోవాలని, తన అభిప్రాయాలకు విలువనివ్వాలని ఆశపడుతుంది. అత్త, మామల అడుగు జాడలో నడుస్తూ.. మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటుంది. సంసారం చక్కగా సాగిపోవాలని భావిస్తుంది. ఇలాగే ఊహించుకుని మెట్టినింట అడుగుపెట్టింది జస్‌ప్రీత్ కౌర్. కానీ అక్కడకు వెళ్లాక ఆమె కలలు కల్లలుగా మారిపోతాయి. కట్టుకున్న మొగుడు.. కాలయముడిగా మారిపోయాడు.
పారాణి ఆరక ముందు భర్త చేతిలో హతమైంది కొత్త పెళ్లి కూతురు. 24 రోజుల క్రితం పెళ్లి కూతురిగా వెళ్లిన జస్‌ప్రీత్ కౌర్ శవమై తిరిగొచ్చింది. హృదయ విదారక ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. నవ వధువుగా వెళ్లిన కూతురు శవమైందని తెలిసి షాక్ లో ఉన్నారు మృతురాలి తల్లీదండ్రులు. మరో నాలుగు నెలల్లో ఉన్నత చదువులు నిమిత్తం కెనడా వెళ్లాల్సిన నవ వధువును పొట్టనబెట్టుకున్నాడు ఆమె భర్త. పెళ్లై పట్టుమని నెల రోజులు కాకుండానే భార్య అంతం చూశాడు కసాయి మొగుడు. బర్నాలాలోని నారాయణగఢ్ సోహియాన్ గ్రామంలో భార్య మెడపై పదునైన వస్తువుతో కొట్టి హత్య చేశాడు భర్త. జస్‌ప్రీత్ కౌర్ పేరెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి సోదరుడు అమృతపాల్ సింగ్, తండ్రి అజ్మీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. జస్‌ప్రీత్ కౌర్‌కు నారాయణగర్ సోహియాన్ గ్రామానికి చెందిన వ్యక్తితో ఆగస్టు 25న వివాహం జరిగింది. భారీగా కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేశాం. ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది. అయితే ఆమె ఉన్నత చదువులు చదవాలనుకుంది. కెనడా వీసా కూడా ఉంది. జనవరిలో కెనడా వెళ్లాల్సి ఉంది. ఇదే విషయం భర్తకు కూడా చెప్పింది. కానీ అతడు ఒప్పుకోలేదని చెబుతున్నారు ఆమె పేరెంట్స్. ఆమె పలుమార్లు వివరణ ఇచ్చేందుకు, ఒప్పించేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. చివరకు ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమెపై కోపంతో పదునైన వస్తువుతో కొట్టడంతో చనిపోయిందని చెబుతున్నారు జస్‌ప్రీత్ కౌర్ కుటుంబ సభ్యులు. ఆమెను ఎంతో కష్టపడి చదివించానని, ఎన్నో ఉన్నత స్థానాలకు వెళుతుందని ఊహిస్తే.. ఇలా అయిపోయిందంటూ కన్నీరు మున్నీరు అవుతున్నాడు తండ్రి. పెళ్లే ఆమె పాలిట శాపమైంది.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.