పిల్లలని చంపేసి కసాయి తల్లిదండ్రులు పరార్! సిగ్గుపడే ఘటన!

భార్యా భర్తల మధ్య, కుటుంబాల మధ్య గొడవలకు చిన్న పిల్లలు బలౌతున్నారు. ఇంట్లో ఏ సమస్య ఉన్నా.. పిల్లలపైనే చూపిస్తున్నారు తల్లిదండ్రులు. చివరకు పసి బిడ్డలని చూడకుండా..

భార్యా భర్తల మధ్య, కుటుంబాల మధ్య గొడవలకు చిన్న పిల్లలు బలౌతున్నారు. ఇంట్లో ఏ సమస్య ఉన్నా.. పిల్లలపైనే చూపిస్తున్నారు తల్లిదండ్రులు. చివరకు పసి బిడ్డలని చూడకుండా..

జీవితాంతం కలిసి ఉంటామని వివాహం చేసుకుంటున్న దంపతులు.. పట్టుమని మూడు నెలలు కూడా కావడం లేదు మనస్పర్ధలతో కొట్టుకు చస్తున్నారు. ఈ మేటర్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పంచాయతీ చేసి సర్ది చెబుతున్నారు. ఇప్పుడే కదా కాపురం స్టార్ చేసింది.. ఇద్దరి అభిప్రాయాలు కలవక గొడవలు పడుతున్నారని, కొన్నాళ్ల పాటు కలిసి సంసారం చేస్తే అవే సర్దుకు పోతాయంటూ నచ్చ చెబుతున్నారు. ఇంతలో పిల్లలు పుట్టేస్తున్నారు. కానీ కలహాలు మాత్రం తగ్గడం లేదు.. ఇంకా పెరుగుతున్నాయి. వీరి సమస్యలకు బలౌతున్నారు పిల్లలు కూడా. వీరి ముందే ఒకరిపై ఒకరు అరుచుకోవడం, తన్నుకోవడం, తిట్టుకోవడం చేస్తున్నారు. ఈ గొడవ అంతా పిల్లల మనస్సులపై ప్రభావితం చూపిస్తుందని ఆలోచించడం లేదు.

మరికొంత మంది అయితే.. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవిత భాగస్వామిపై కోపంతో పిల్లల మీద పగ తీర్చుకుంటున్నారు. అభం, శుభం తెలియని పిల్లల్ని చంపేస్తున్నారు కొందరు. తాజాగా అటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. సమాజం సిగ్గుపడేలా.. కడుపున పుట్టిన పిల్లల్ని చంపి.. పారిపోయారు తల్లిదండ్రులు. చివరకు ఆ భార్యాభర్తలు కూడా మృతులై తేలారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్న గూడెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు కూతుళ్లను చంపి పరారైన తల్లిదండ్రుల కథ విషాదాంతం అయ్యింది.

వివరాల్లోకి వెళితే కందగట్ల అనిల్- దేవి భార్యా భర్తలు. వీరికి లాస్య, లోహిత అనే చిన్నారులు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా గత నెల 10వ తేదీన తమ పిల్లలు ఇద్దరికీ విషం ఇచ్చి.. భార్యా భర్తలు పరారయ్యరు. సమాచారం అందుకున్న పోలీసులు.. వీరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. చివరకు ఈ దంపతులు కూడా స్థానిక అడవిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఓ కుటుంబం విచ్చిన్నం కావడమే కాదూ.. నాశనం అయ్యిందని చెప్పడానికి ఈ సంఘటనే ఓ ఉదాహరణ.

Show comments