iDreamPost
android-app
ios-app

రెండవ భార్య కోసం మొదటి భార్యను పుట్టింటి నుండి తీసుకువచ్చి..

  • Published Jan 26, 2024 | 4:45 PM Updated Updated Jan 26, 2024 | 4:45 PM

భార్య ఉండగానే కొంత మంది వంక దారులు పడుతుంటారు. ఆమె కళ్లు గప్పి.. మరొకరితో రాసలీలలు నడుపుతుంటారు. రెండిళ్ల పూజారి వ్యవహారం తెలియనంత వరకు అతడి ఆటలు సాగిపోతుంటాయి. భార్యకు తెలిసిందని అనుమానం వచ్చాక..

భార్య ఉండగానే కొంత మంది వంక దారులు పడుతుంటారు. ఆమె కళ్లు గప్పి.. మరొకరితో రాసలీలలు నడుపుతుంటారు. రెండిళ్ల పూజారి వ్యవహారం తెలియనంత వరకు అతడి ఆటలు సాగిపోతుంటాయి. భార్యకు తెలిసిందని అనుమానం వచ్చాక..

  • Published Jan 26, 2024 | 4:45 PMUpdated Jan 26, 2024 | 4:45 PM
రెండవ భార్య కోసం మొదటి భార్యను పుట్టింటి నుండి తీసుకువచ్చి..

భార్య పక్కన ఉండగానే వంకర చూపులు చూస్తుంటాడు భర్త. ఆమె దగ్గర దక్కని సుఖ సంతోషాల కోసం పరాయి స్త్రీలో వెతుక్కునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇక మరో అమ్మాయి మోజులో పడ్డాక..భార్యకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఆమెకు సూచాయగా తెలిసిన.. తమ సుఖ సంతోషాలకు అడ్డుగా ఉన్న భార్యను తొలగించుకునేందకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటి పురుషల జాబితాలో ఇతడు కూడా ఒకడు. మంచి భార్య, ఒక బిడ్డ ఉండగానే.. మరో యువతితో ప్రేమ రాగాలు వల్లించాడు. మొదటి భార్యకు తెలియకుండా ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వీరి ఆనందానికి అడ్డుగా ఉందని మొదటి భార్యను అనంత లోకాలకు పంపించేశాడు.

రెండవ భార్యతో సుఖం కోసం.. మొదటి భార్యను హత్య చేసి సరస్సులో పడేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని దావరణ గెరె తాలూకాలోని కొడగనూర్ ‌ చోటుచేసుకుంది. చిత్రదుర్గ జిల్లా హోళల్‌కెరె తాలూకా ససలుహల్లా గ్రామానికి చెందిన కావ్య, సచిన్ భార్యా భర్తలు. ఐదేళ్ల క్రితం పెళ్లి కాగా, వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే అతడికి అమ్మాయిల వీక్ నెస్ ఉంది. భార్య ఉండగానే.. పలువురు అమ్మాయిల వెంట పడేవాడు. అలా దావణగెరె తాలూకాలోని కడ్లేబాలు గ్రామానికి చెందిన చైత్ర వెనకబడ్డాడు. చివరకు ఆమె ఒకే చెప్పడంతో రహస్యంగా ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి ప్రేమకు, ఆనందానికి మొదటి భార్య కావ్య అడ్డుగా ఉందని భావించిన అతడు.. ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. భార్యను గొంతు నులిమి హత్య చేసి.. గోనె సంచిలో వేసి దావణగెరె తాలూకాలోని కొడగనూరు సరస్సులో పడేశాడు.

కాగా, కావ్య కనిపంచకపోవడం లేదంటూ నాటకాలు ఆడాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త సచిన్ తీరుపై అనుమానం రాగా, అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైత్రతో వ్యవహారం భార్యకు తెలియడంతో గొడవ పడి గ్రామానికి వెళ్లిపోయింది. అయితే ఆమెను తిరిగి తీసుకువచ్చాడు భర్త. అయితే చైత్రకు ఈ విషయం తెలిసి గొడవ పెట్టుకుంది. దీంతో కావ్య కథ ముగించాలనుకున్నాడు. ఆ తర్వాత ఆమెను చంపి గోనె సంచిలో కట్టి చెరువులో పడేశాడు. అయితే ఆమె కనిపించడం లేదంటూ డ్రామాలు చేయడంతో..అతడిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి గుట్టు రట్టయ్యింది. ఆమె మృతదేహాన్ని 19 రోజుల తర్వాత వెలికి తీశారు పోలీసులు. సచిన్, చైత్రలను అదుపులోకి తీసుకున్నారు.   ఇప్పుడు వీరిద్దరూ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet