iDreamPost
android-app
ios-app

13 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే దారుణం

  • Published Jan 21, 2024 | 6:15 PM Updated Updated Jan 21, 2024 | 6:15 PM

కూతురికి మంచి సంబంధం కుదిరిందన్న ఆనందంలో ఉన్నారు తల్లిదండ్రులు. మరికొన్ని రోజుల్లో పెళ్లి. పెళ్లి దగ్గరపడుతుండటంతో హడావుడి నెలకొంది. వివాహ పనుల్లో బిజీ అయిపోయారు తల్లిదండ్రులు. కానీ పెళ్లి కూతురు మాత్రం..

కూతురికి మంచి సంబంధం కుదిరిందన్న ఆనందంలో ఉన్నారు తల్లిదండ్రులు. మరికొన్ని రోజుల్లో పెళ్లి. పెళ్లి దగ్గరపడుతుండటంతో హడావుడి నెలకొంది. వివాహ పనుల్లో బిజీ అయిపోయారు తల్లిదండ్రులు. కానీ పెళ్లి కూతురు మాత్రం..

  • Published Jan 21, 2024 | 6:15 PMUpdated Jan 21, 2024 | 6:15 PM
13 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే దారుణం

పెళ్లంటే అమ్మాయిలకు ఎన్నో అంచనాలున్నాయి. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులకు పిల్లల ఆశలు, ఆకాంక్షలు అవసరం లేదు. చదువు అయిపోయాక ఉద్యోగం.. అదీ కొన్ని రోజులే. ఇక ఇంట్లో ఉంచకూడదు. ఎవరో ఒకరి ఇచ్చి ముడిపెట్టేయాల్సిందే. అమ్మాయికి పెళ్లీడు రావడం ఆలస్యం.. ఓ అయ్య చేతిలో పెట్టేస్తుంటారు. పెళ్లి చేసుకోనని కూతురు చెబితే.. ఆమె ఇష్టా ఇష్టాలను పట్టించుకోరు. పైగా ఆమెకు ఎవరో లవర్ ఉన్నాడని, అందుకే వివాహానికి అంగీకరించడం లేదన్న అపవాదులు వేస్తుంటారు తల్లిదండ్రులే. వీరితో తోడు.. బంధువులు, చుట్టుప్రక్కల వారి సూటి పోటీ మాటలతో మానసికంగా హింసిస్తుంటారు. వీటి కన్నా..ఇష్టం ఉన్నా లేకపోయినా తలవంచి తాళి కట్టించుకునే అమ్మాయిలు ఎందరో ఉన్నారు.

చైత్ర విషయంలో తల్లిదండ్రులది ఇదే మంకు పట్టు. కాదనలేక.. పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి 13 రోజులు ఉందనగా.. ఇంట్లో హడావుడి నెలకొంది. కానీ అంతలో కూతురు బాత్రూములో ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. దీంతో శోక సంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఒకరింట కోడలిగా వెళ్లాల్సిన అమ్మాయి.. పెళ్లి పీటలు ఎక్కకుండానే.. కాటికి చేరింది. వివరాల్లోకి వెళితే.. షిమోగాలోని తీర్థహళ్లి తాలూకాలోని కట్టెహక్లు గ్రామానికి చెందిన చైత్ర..ఎంకాం చదువుకుంది. స్థానికంగా రామకృష్ణ మెడికల్స్‌లో వర్క్ చేస్తుంది.  అంతలో ఆమెకు పెళ్లి ప్రపోజల్స్ రావడం మొదలు అయ్యాయి.

 ఆమెకు ఓ వరుడ్ని చూసి తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. వచ్చే నెల 4వ తేదీన ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. కాగా, ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి 13 రోజులు ఉండగా.. బాత్రూంలో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు..చైత్ర మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అయితే ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. అయితే ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అయినప్పటికీ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పించారని, ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కూతురి బాధలు, సమస్యలు తెలుసుకోనంత వరకు ఎంత మంది చైత్రలు బలవుతారో.. ఏమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet