iDreamPost
android-app
ios-app

కలెక్టర్‌ కావాలనుకుంది.. కానీ ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్ని నాశనం చేసింది

  • Published May 11, 2024 | 10:56 AM Updated Updated May 11, 2024 | 10:56 AM

ఈ ఫోటోలో కనిపిస్తున్న ముచ్చటైన జంట.. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమెకు కలెక్టర్ కావాలన్నదీ లక్ష్యం. దీంతో ఒక్కర్తే సిటీకి వచ్చి యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుంది. కానీ

ఈ ఫోటోలో కనిపిస్తున్న ముచ్చటైన జంట.. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమెకు కలెక్టర్ కావాలన్నదీ లక్ష్యం. దీంతో ఒక్కర్తే సిటీకి వచ్చి యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుంది. కానీ

  • Published May 11, 2024 | 10:56 AMUpdated May 11, 2024 | 10:56 AM
కలెక్టర్‌ కావాలనుకుంది.. కానీ ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్ని నాశనం చేసింది

ఎంతో మంది అమ్మాయిలు ప్రేమ మాయలో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడిపై అతి నమ్మకంతో అతడ్ని గుడ్డిగా నమ్మేస్తుంటారు. తన ప్రియుడి తనకే సొంతం కావాలని అనుకుంటారు. తను పక్కనే ఉండగా.. మరో అమ్మాయిని చూస్తేనే తట్టుకోలేదు. ఇక మాట్లాడితే ఊరుకుంటుందా. అతడు తన సొత్తు అని భావిస్తుంది. ప్రియుడ్ని భర్తగా ఊహించుకుని..పెళ్లికి ముందే సర్వస్వం అప్పగిస్తూ ఉంటుంది. అతడు చెప్పిన చోటికీ, కోరిన కోరికలు నో అనకుండా తీర్చేస్తుంటారు. ప్రియుడి కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమౌతూ ఉంటుంది. అన్నీ అయిపోయాక.. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ప్రియుడి అసలు రంగు, రూపు బయటకు వస్తుంది. అప్పుడు కానీ తెలియదు.. తనది ప్రేమ కాదని, తనను లవర్ అవసరాలకు వాడుకున్నాడు అని.

ఇదిగో ఇలాగే కాస్త ఆలస్యంగా కళ్లు తెరుచుకుంది ఈ ఫోటోలోని అమ్మాయి. మనస వాచా అతడ్ని ఇష్టపడ్డ అమ్మాయి.. చివరకు తనకు లవర్ హ్యాండ్ ఇచ్చాడని తెలిసే సరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అలంద తాలూకా కౌలగా గ్రామానికి చెందిన పుష్ప (26) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుంది. కలెక్టర్ కావాలన్నదీ ఆమె కోరిక. అందుకే గదిలో ఉంటూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. దీని నిమిత్తం కలబుర్గికి వచ్చి జీవిస్తోంది. కోటనూరు సమీపంలోని అద్దె ఇంట్లో ఉంటుంది. ఈ సమయంలో గాంధీనగర్‌లో నివాసముంటున్న కిరణ్‌తో పరిచయం ఏర్పడి.. ప్రేమకు దారి తీసింది. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ మాయలో చదువు అటకెక్కేసింది. ప్రియుడికి సర్వస్వం అప్పగించింది.

 అయితే  కొన్ని రోజులుగా కిరణ్‌ను పెళ్లి చేసుకోవాలని పుష్ప పట్టుబడుతోంది. కానీ ఇప్పుడు కాదని, రేపు, మాపు అంటూ ఆమెకు చెప్పుకుంటూ వచ్చాడు.  గట్టిగా నిలదీసే సరికి బోర్ కొట్టేశావంటూ నోరు జారాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది పుష్ప. శుక్రవారం ఉదయం నుంచి పుష్ప తన గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వెళ్లి చూడగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు ఏదో ఒక ప్రభుత్వ కొలువు కొడుతుంది అనుకున్నారు.. కానీ ఇలా అర్థంతరంగా తనువు చాలిస్తుందని ఊహించలేదు. ప్రేమ ఆమె జీవితాన్ని నాశనం చేసిందని గుర్తించారు. ప్రియుడు కిరణ్‌ను విచారిస్తున్నారు పోలీసులు. పుష్ప కలెక్టర్‌ కావాలనుకుంది.. కానీ లవ్  మాయలో పడి ఆత్మహత్య చేసుకుంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet