Krishna Kowshik
ప్రేమికులు పెళ్లికి ముందే అడ్వాన్స్ అవుతున్నారు. మరింత అర్థం చేసుకోవచ్చునన్న ఉద్దేశంతో లివింగ్ రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా.. ఇద్దరు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. ఇక్కడే మొదలౌతోంది..
ప్రేమికులు పెళ్లికి ముందే అడ్వాన్స్ అవుతున్నారు. మరింత అర్థం చేసుకోవచ్చునన్న ఉద్దేశంతో లివింగ్ రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా.. ఇద్దరు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. ఇక్కడే మొదలౌతోంది..
Krishna Kowshik
ప్రేమికులు అన్నాక సినిమాలు, షికార్లే కాదూ.. చిన్న చిన్న గొడవలు, అలకలు, అనుమానాలు, ఇగోలు ఉంటాయి. ఇవి పెద్దగా మారితే.. ఇద్దరూ డిస్ట్రబ్ అవుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ప్రేమికులు పెళ్లికి ముందు లివ్ రిలేషన్ షిప్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒకే ఇంట్లో కాపురం పెట్టేస్తున్నారు. ఇదే సమయంలో భార్యా భర్తల్లా మెలుగుతున్నారు. ఇక్కడే మొదలౌతుంది అసలు సమస్య. లవర్స్ మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడి.. తగాదాలు మొదలౌతున్నాయి. కొంత మంది ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పుకుంటుంటే.. మరికొన్ని ప్రేమల్లో.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటనే కలవరపాటుకు గురి చేసింది. ప్రియుడి ఫ్లాటులో ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని గౌహతిలో హతిగావ్ ప్రాంతంలోని రాజ్ పాత్‌లోని కాసా లిమిటాలో అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్నాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూపేష్ రాయ్. మేఘాలయకు చెందిన రితికా సోనార్, రూపేష్ కొన్నాళ్లుగా లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అతడి ఫ్లాటులో వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. అయితే అనుకోకుండా బుధవారం రాత్రి వీరిద్దరూ గొడవ పడ్డారు. దీంతో రితికా మానసిక క్షోభకు గురై.. గది తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతకు గది నుండి బయటకు రాకపోవడంతో రూపేష్ ఆమె గది తలుపులు కొట్టగా.. ఉలుకు పలుకు లేదు. దీంతో అనుమానం వచ్చి తలుపులు పగుల కొట్టి చూశాడు. ఆమె గదిలో అపస్మారక స్థితిలో పడి ఉంది.
వెంటనే రితికాను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసి ప్రియుడు రూపేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఇటీవల కాలంలో యువతుల మరణాలు అస్సాంను వణికిస్తున్నాయి. గతంలో అంజు దోర్జీ అనే మహిళ చనిపోగా, అనుష్క సైకియా కూడా అనే యువతి కూడా అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ లివింగ్ రిలేషన్ ద్వారా అర్థం చేసుకోవడమేమో కానీ.. అపార్థాలు వచ్చి.. ప్రేమికులు విడిపోవడాలు, గొడవపడటాలు ఎక్కువవుతున్నాయి. మరీ ఇలాంటి సహజీవనం అవసరమంటారా..? అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.