iDreamPost
android-app
ios-app

మిస్టరీ డెత్‌.. ఆమె చావును ముందుగానే ఊహించిన వృద్ధురాలు!

మిస్టరీ డెత్‌.. ఆమె చావును ముందుగానే ఊహించిన వృద్ధురాలు!

రాథే శ్యామ్‌ సినిమాలో హీరో ప్రభాస్‌ చెయ్యి చూసి మనుషుల జాతకాలు చెబుతూ ఉంటాడు. అంతేకాదు! ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడన్నదాన్ని కూడా చెబుతూ ఉంటాడు. నిజ జీవితంలో ఇలా చెయ్యి చూసి మరణాన్ని చెప్పే వారు కోటికొకరు మాత్రమే ఉంటారు. అయితే, మనం ఇప్పుడు చెప్పుకోబోయేస్టోరీలో ఓ జ్యోతిష్యురాలు ఓ మహిళ మరణాన్ని ముందుగానే ఊహించింది. ఆమె చెప్పినట్లుగానే ఆ మహిళ చనిపోయింది. అయితే, మహిళ మరణం మాత్రం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

ఇంతకీ సంగతేంటంటే.. బ్రెజిల్‌లోని మ్యాసియోకు చెందిన పెర్నాండా సిల్వ వాలోజ్‌ డా క్రజ్‌ పింటో అనే మహిళ ఆగస్టు 3న రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. మార్గం మధ్యలో ఓ ముసలావిడ పెర్నాండాను ఆపింది. చెయ్యి చూసి జాతకం చెబుతా అని ఇంట్లోకి ఆహ్వానించింది. పెర్నాండాలో సరేనంటూ లోపలికి వెళ్లింది. ఆ ముసలావిడ పెర్నాండో చెయ్యి చేసి ఓ చేదు భవిష్యత్తు చెప్పింది. ‘‘ మరికొద్దిరోజుల్లో నువ్వు చనిపోబోతున్నావ్‌’’ అని అంది. దీంతో పెర్నాండా షాక్‌ అయింది.

ఆ ముసలావడి ఓ చాక్లెట్‌ ఇవ్వగా దాన్ని తింది. తర్వాత అక్కడినుంచి ఇంటికి వచ్చింది. ఆ చాక్లెట్‌ తిన్న కొద్దిసేపటినుంచి పెర్నాండా ఆరోగ్యం పాడవుతూ వచ్చింది. ఆ ముసలావిడ ఇచ్చిన చాక్లెట్‌ తిన్నప్పటినుంచే తనకు ఇలా అవుతోందని పెర్నాండా తన కుటుంబసభ్యులకు చెప్పింది. వారు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆగస్టు 4న చనిపోయింది. కుటుంబసభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో పెర్నాండా విష ప్రయోగం కారణంగా చనిపోయిందని తేలింది. ఆ ముసలావిడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombaymavi girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis