సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య.. హంతకుడి ఆచూకీ చెబితే ఐదున్నర కోట్ల బహుమతి

హత్యకేసులో నిందితుడి ఆచూకీ చెబితే ఏకంగా ఐదున్నర కోట్ల బహుమతిని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసును చేదించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

హత్యకేసులో నిందితుడి ఆచూకీ చెబితే ఏకంగా ఐదున్నర కోట్ల బహుమతిని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసును చేదించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు ఇలా ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు దుండగులు. క్రైమ్ చేసిన వారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక నిందితులను పట్టుకోవడం ఈజీ అయిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుంటారు. ఎంత గాలించినా కూడా పోలీసుల చేతికి చిక్కరు. ఇలాంటి సందర్భాల్లో నిందితుల ఆచూకీ చెబితే కొంత మొత్తాన్ని బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తూ ఉంటారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల మీద, కరుడుగట్టిన నేరస్తుల ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డ్ ప్రకటిస్తారు.

ఇదే విధంగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో నిందితుడి ఆచూకీ చెబితే ఏకంగా ఐదున్నర కోట్లు బహుమతిని అందించనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభా అరుణ్ కుమార్ అనే మహిళ సిడ్నీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నది. ఈమె బెంగళూరుకు చెందిన మహిళ. కాగా ఈమె 2015 మార్చి 07న హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతులో కత్తితో పొడిచి హత్య చేశారు. అయితే ఈ హత్య జరిగి 10 ఏళ్లు కావొస్తున్న ఇప్పటి వరకు హంతకుడిని పట్టుకోలేక పోయారు అక్కడి పోలీసులు. అతడి వివరాలను, ఆచూకీని గుర్తించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును ఎలాగైనా చేదించాలని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం నిర్ణయించింది.

నిందితుడిని పట్టుకునేందుకు ఆచూకీ చెప్పిన వారికి మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇది మన దేశ కరెన్సీలో రూ. 5 కోట్ల 57 లక్షలకు సమానం. కాగా ప్రభా అరుణ్ కుమార్ హత్యకు ముందు బెంగళూరులోని మైండ్ ట్రీ కంపెనీలో పనిచేసేది. విధి నిర్వహణలో భాగంగా ఆమె సిడ్నీకి వెళ్లారు. అయితే ఓ రోజు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే సమయంలో బెంగళూరులో ఉన్న భర్తతో ఫోన్ లో మాట్లాడుతూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇదే సమయంలో తనను ఎవరో వెంబడిస్తున్నారని.. తర్వాత ఫోన్ చేస్తానని భర్తతో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమె తన ఇంటికి 300 మీటర్ల దూరంలో హత్యకు గురయ్యారు. విచక్షణా రహితంగా దాడి చేసి ఆమెను హతమార్చారు.

ఈ హత్య కేసులో నిందితులను ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. నిందితుల కోసం పోలీసులు ఇంకా వేటాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుల ఆచూకీ చెబితే ఐదున్నర కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం. మరోవైపు హత్య జరిగి దశాబ్ధ కాలం గడుస్తున్నా నిందితులను పట్టుకోకపోవడంతో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రభా అరుణ్ కుమార్ ను హత్య చేసిన నిందితుల ఆచూకీ చెబితే ఐదున్నర కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments