iDreamPost
android-app
ios-app

ఘోరం: రాఖీ కట్టి తిరిగొస్తున్న అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం!

  • Published Sep 02, 2023 | 8:06 PM Updated Updated Sep 02, 2023 | 8:06 PM
  • Published Sep 02, 2023 | 8:06 PMUpdated Sep 02, 2023 | 8:06 PM
ఘోరం: రాఖీ కట్టి తిరిగొస్తున్న అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం!

దేశంలో ఏదో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ,పెళ్లి పేరుతో వంచిస్తూ వారి జీవితాలను అందకారం చేస్తున్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికి మృగాళ్లలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే దేశంలో మరో ఘటన తీవ్ర కలకలంరేపింది. ఆప్యాయత అనురాగాలకు ప్రతీకైన రక్షాబంధన్ పండుగ రోజున ఓ అల్లరి మూక ఇద్దరు అక్కాచెల్లెళ్లపై దారుణానికి ఒడిగట్టారు. రక్షాబంధన్ వేడుకలు జరుపుకుని తిరిగి వస్తున్న క్రమంలో అక్కాచెల్లెళ్ల సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది.

రాయ్ పూర్ కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు పొరుగూరులో ఉన్న తమ అన్నయ్యకు రాఖీ కట్టేందుకు ఆ ఇద్దరిలో ఓ యువతికి కాబోయే భర్తతో కలిసి బైక్ పై బయలుదేరారు. అక్కడ రాఖీ పండుగను జరుపుకుని సొంతూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కొంత దూరం వచ్చాక మార్గమద్యలో ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు, నగదును బలవంతంగా దోచుకున్నారు. ఆ తరువాత మరో ఏడుగురు దుండగులు బైక్ లపై వచ్చి ఇద్దరు అక్కా చెల్లెళ్లను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆ యువతి కాబోయే భర్తపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.

ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర కలకలంరేగింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేరానికి పాల్పడిన పది మంది నిందితులను అరెస్టు చేశారు. అయితే ఆ నిందితుల్లో స్థానిక బీజేపీ నాయకుడి కొడుకు ఉండడంతో మరింత చర్చకు దారితీసింది. నిందితులు ఇది వరకు పలు నేరాల్లో హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom