కంపెనీలు కస్టమర్లకు ఇచ్చే ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. మరి ఈ డిస్కౌంట్ల గుట్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కంపెనీలు కస్టమర్లకు ఇచ్చే ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. మరి ఈ డిస్కౌంట్ల గుట్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో.. మనిషికి సరిగ్గా తినడానికే టైమ్ సరిపోవడం లేదు. ఇంక వండుకోవడానికి టైమ్ ఎక్కడ ఉంది అని చాలా మంది అంటూ ఉంటారు. ఇక ఇలాంటి వారి కోసమే వ్యవస్థలో పుట్టుకొచ్చాయి ఫుడ్ డెలివరీ సంస్థలు. స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు ఆర్డర్ పెడితే చాలు.. క్షణాల్లో ఇంటికి తెచ్చి ఆహారాన్ని ఇచ్చిపోతుంటారు. ప్రస్తుతం ఈ బిజినెస్ కొన్ని వేల కొట్లకు చేరుకుందంటే అతిశయోక్తికాదు. ఇక కస్టమర్లను ఆకర్షించడానికి సంస్థలు డిస్కౌంట్లు ఇస్తూ ఉంటుంది. అయితే ఈ ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. మరి డిస్కౌంట్ల గుట్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు తమ కస్టమర్లకు తరచుగా 50 శాతం, 60 శాతం అంటూ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఈ ఆఫర్లకు సంబంధించిన కిటుకును వెల్లడించాడు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తన పోడ్ కాస్ట్ ‘ది రణవీర్ షో’లో చర్చ సందర్బంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు గోయల్. అతడు మాట్లాడుతూ..”మా సంస్థ తరచుగా రూ.80 వరకు 50 శాతం తగ్గింపు లాంటి ఆఫర్లను అందజేస్తుంది. అయితే నిజానికి ఇక్కడ కస్టమర్ కు లభించే డిస్కౌంట్ రూ.80 మాత్రమే. పూర్తిగా 50 శాతం తగ్గింపు కాదు. ఉదాహరణకు ఆర్డర్ మెుత్తం రూ.400 అయితే దానిపై లభించే డిస్కౌంట్ రూ.80 అంటే మీకు లభించే ఆఫర్ 20 శాతం మాత్రమే” అని నిజాయితీగా చెప్పుకొచ్చారు గోయల్.
అయితే ఇలాంటి డిస్కౌంట్ పద్దతులు కస్టమర్ ను తప్పుదారి పట్టిస్తాయి. వాటిని మార్చాలని నాకూ ఉందని గోయల్ స్పష్టం చేశాడు. కానీ పోటీదారులు ఉన్నప్పుడు జొమాటో మాత్రమే దాన్ని మార్చడం కష్టమని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇలాంటి ఆఫర్లను నిజాయితీగా పరిగనించను.. డిస్కౌంట్స్ సూటిగా ఉండాలని గోయల్ స్పష్టం చేశాడు. మరి జొమాటో సీఈవో చెప్పిన డిస్కౌంట్ లెక్కలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.