Zomato Legends: ఇంటర్ సిటీ లెజెండ్స్ సేవలను నిలిపివేసిన జొమాటో

Zomato Shut Downs Iconic Service: భారీ నష్టాల కారణంగా జొమాటో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జొమాటో ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కస్టమర్స్ కి షాక్ తగిలినట్లయింది.

Zomato Shut Downs Iconic Service: భారీ నష్టాల కారణంగా జొమాటో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జొమాటో ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కస్టమర్స్ కి షాక్ తగిలినట్లయింది.

జొమాటో సంస్థ ఇంటర్ సిటీ లెజెండ్స్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ప్రాముఖ్యత చెందిన బెస్ట్ వంటకాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ ఇంటర్ సిటీ లెజెండ్స్ పని చేస్తుంది. ఆ మధ్య ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన కంపెనీ జూలై నెలలో ఆదాయం పెంచుకునేందుకు తిరిగి ప్రారంభించింది. అయితే ఆశించిన మేర లాభాలు లేకపోవడంతో ఈ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ ద్వారా వెల్లడించారు. ‘రెండేళ్ల ప్రయత్నాల తర్వాత ప్రోడక్ట్ మార్కెటింగ్ ఫిట్ ని కనుగొనలేని కారణంగా వెంటనే ఈ సర్వీస్ ని షట్ డౌన్ చేయాలని నిర్ణయించుకున్నాం’ అని అన్నారు.        

ఇంటర్ సిటీ లెజెండ్స్ అనేది.. 24 గంటల్లో కస్టమర్ కోరుకున్న ఆర్డర్ ని దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా డెలివరీ చేస్తుంది. దేశంలోని 10 టాప్ సిటీల్లో ఉన్న రెస్టారెంట్ ఫుడ్ ని ఆర్డర్ చేసిన కస్టమర్ కి 24 గంటల్లో డెలివరీ చేసే సర్వీస్ ఇది. రాత్రి 7 గంటల లోపు ఆర్డర్ చేస్తే.. రెస్టారెంట్ లో కస్టమర్ కోరుకున్న ఫుడ్ ని రెస్టారెంట్ లో ప్రిపేర్ చేయించి రీయూజబుల్ టాంపర్ ప్రూఫ్ కంటైనర్ లో ప్యాక్ చేస్తారు. పాడవకుండా ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం గానీ, ఫ్రీజింగ్ చేయడం గానీ చేయరు. మొబైల్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీని వాడి ఫుడ్ ని పాడవ్వకుండా చూస్తుంది. కస్టమర్ ఫుడ్ పార్సిల్ ని అందుకున్న తర్వాత మైక్రోవేవ్ లో గానీ ఎయిర్ ఫ్రై లో గానీ పాన్ ఫ్రై గానీ చేసుకుని వేడి వేడిగా తినచ్చు.

ఈ ఫుడ్ పార్సిల్స్ అనేవి ఒక సిటీ నుంచి ఫ్లైట్ ద్వారా మరొక సిటీలో ఉన్న కస్టమర్ కి 24 గంటల్లో డోర్ డెలివరీ చేస్తారు. అయితే నష్టాల వల్ల ఈ సేవలను ఇప్పుడు పూర్తిగా నిలిపివేసింది కంపెనీ. ఇంటర్ సిటీ లెజెండ్స్ సర్వీస్ 2022లో లాంచ్ అయ్యింది. అయితే ప్రారంభంలో కనీస ఆర్డర్ విలువ 5 వేల రూపాయలు అయినా ఉంటే లాభం ఉంటుందని అనుకుంది. కానీ అంత విలువైన ఆర్డర్స్ రాలేదు. దీంతో కొన్నాళ్ళు హోల్డ్ లో పెట్టి జూలై నెలలో ప్రారంభించింది. అయినప్పటికీ లాభం లేకపోవడంతో మొత్తానికి ఈ సర్వీస్ ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు మరో సర్వీస్ ని కూడా జొమాటో నిలిపివేసింది. గురుగ్రామ్ ఆధారిత కంపెనీ అయిన జొమాటో ఎక్స్ ట్రీమ్ అనే లాజిస్టిక్ సేవలను కూడా నిలిపివేసింది. వ్యాపారుల నుంచి పార్సిల్స్ సేకరించి వేరొకరికి అందజేయడమే లక్ష్యంగా ఈ సర్వీస్ లాంచ్ అయ్యింది. కానీ ఇది ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేకపోవడంతో కంపెనీ ఈ సేవలను కూడా నిలిపివేసింది.

Show comments