మీకు TAX ఆదా అవ్వాలా? ఇలా చేస్తే భారీగా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు!

TAX: చాలా మంది కూడా ట్యాక్స్ కడుతూ ఉంటారు. అయితే కొన్నింటిలో పెట్టుబడి పెడితే మీరు ఈజీగా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు.

TAX: చాలా మంది కూడా ట్యాక్స్ కడుతూ ఉంటారు. అయితే కొన్నింటిలో పెట్టుబడి పెడితే మీరు ఈజీగా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ట్యాక్స్ పేయర్స్ చాలా జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చింది. ట్యాక్స్ ఆదా కావాలంటే కచ్చితంగా మీరు సంపాదించే డబ్బుని దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద ఆర్థిక సంవత్సరంలో భారీగా ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మీరు టాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు. అక్కడ మీరు పెట్టుబడులపై టాక్స్ ఆదా చేసుకోవచ్చు. అలాగే క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక మీ సంపాదనపై మీరు ట్యాక్స్ ఆదా చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ మెంట్ చేయాలి? ఎంత వరకు మీరు ట్యాక్స్ చేయవచ్చు ? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పీపీఎఫ్.. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇండియాలోనే ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. పైగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. కాబట్టి చాలా సేఫ్ కూడా. ఇక్కడ మీరు ఏడాదికి కనీసం రూ. 500 నుంచి మాక్సిమం రూ. 1.50 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మీరు ఇందులో మొత్తం 15 సంవత్సరాలు పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ట్యాక్స్ బెనిఫిట్ తో భారీ లాభాలు సొంతం చేసుకోవచ్చు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపైనా ఏడాదికి మాక్సిమం రూ. 1.50 లక్షల దాకా టాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.ఇక సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా మీకు ట్యాక్స్ సేవ్ చేసే అద్భుతమైన స్కీమ్. ఈ స్కీమ్ లో పదేళ్ల వయసులోపు పాపను చేర్చొచ్చు. ఇందులో మీరు మినిమమ్ రూ. 250 నుంచి మాక్సిమం రూ. 1.50 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో మీరు 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) కూడా మీకు ట్యాక్స్ ని ముగిలించే బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్. ఇందులో మీరు మినిమమ్ రూ. 1000 ఆపైన ఇన్వెస్ట్ చేయొచ్చు. మాక్సిమం ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో రూ. 1.50 లక్షల దాకా టాక్స్ సేవ్ చేసుకోవచ్చు.అలాగే సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది ఒకేసారి ఇన్వెస్ట్ చేసే స్కీమ్. ఇందులో మీరు రూ. 30 లక్షల దాకా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ విధంగా మీరు ఈ సేఫ్ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే కచ్చితంగా ట్యాక్స్ ఆదా చేసుకోవడమే కాకుండా ఆ స్కీమ్స్ కి సంబంధించి మంచి లాభాలను కూడా సొంతం చేసుకోవచ్చు. కాబట్టి కచ్చితంగా వీటిలో పెట్టుబడి పెట్టండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments