nagidream
Mini Projector: పెద్ద స్క్రీన్ లో సినిమా చూస్తే ఆ మజానే వేరు. కానీ 40 అంగుళాలు, 50 అంగుళాల టీవీలు కొనాలంటే వేలు, లక్షలు పెట్టాలి. అలా కాకుండా 2500కి ఈ మినీ ప్రాజెక్టర్ ని కొనుక్కుంటే ఎంచక్కా పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూసుకోవచ్చు.
Mini Projector: పెద్ద స్క్రీన్ లో సినిమా చూస్తే ఆ మజానే వేరు. కానీ 40 అంగుళాలు, 50 అంగుళాల టీవీలు కొనాలంటే వేలు, లక్షలు పెట్టాలి. అలా కాకుండా 2500కి ఈ మినీ ప్రాజెక్టర్ ని కొనుక్కుంటే ఎంచక్కా పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూసుకోవచ్చు.
nagidream
టీవీలో సినిమా చూస్తుంటే పెద్ద కిక్ అనిపించట్లేదా? అయితే మీ కోసమే ఈ మినీ ప్రాజెక్టర్. థియేటర్ లో సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. దీన్ని చాలా సులువుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. ఒక చేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజ్ లో ఉంటుంది. కానీ బొమ్మ మాత్రం పెద్దగానే వస్తుంది. ఇది వామ్ఓ కంపెనీకి చెందిన వైజీ 300 ప్రో మినీ ప్రాజెక్టర్. ఈ పోర్టబుల్ ఫిల్మ్ ప్రాజెక్టర్ 1080పిక్సెల్ సపోర్ట్ తో వస్తుంది. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్ లెట్స్, పీఎస్ 4 ప్లే స్టేషన్, ఫైర్ స్టిక్ వంటి వాటితో ఈజీగా కనెక్ట్ అవుతుంది. యూఎస్బీ, హెచ్డీఎంఐ, వీజఏ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డుని కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్నగా తక్కువ బరువుతో ఉంటుంది. 360 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.
మీరు చిన్న బ్యాగ్ లో ఎక్కడికి కావాలంటే అక్కడకి సులువుగా పట్టుకెళ్ళచ్చు. ఫ్రెండ్స్ తో చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్ లు చేసుకున్నప్పుడు వీడియోలని, సినిమాలని ఈ ప్రాజెక్టర్ ద్వారా పెద్ద స్క్రీన్ మీద చూడవచ్చు. ఇంట్లో ఖాళీ గోడ మీద ప్రాజెక్టర్ వేసుకుని పెద్ద స్క్రీన్ మీద సినిమా చూడవచ్చు. బయటకు తీసుకెళ్లినప్పుడు ఛార్జింగ్ అయిపొతుందెమో అన్న భయం అవసరం లేదు. యూఎస్బీ పోర్ట్ ద్వారా యూఎస్బీ ఛార్జర్ తో, మొబైల్ పవర్ లేదా ల్యాప్ టాప్ తో ప్రాజెక్టర్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి 800×480 పిక్సెల్స్. గోడ మీద లేదా తెర మీద వేసినప్పుడు బొమ్మ అంత స్పష్టంగా కనబడదు కానీ పర్లేదు థియేటర్ లో పెద్ద స్క్రీన్ లో చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.
ఇంత తక్కువ ధరకే ఆ మాత్రం వస్తుందంటే గొప్ప విషయమే. 65 అంగుళాల స్క్రీన్ సైజ్ వరకూ ఇది సపోర్ట్ చేస్తుంది. స్పీకర్ డయామీటర్ 150 అంగుళాల వరకూ ఇచ్చారు. 30 వాట్స్ కెపాసిటీతో వస్తుంది. కస్టమర్స్ రివ్యూలు కూడా బాగానే ఇచ్చారు. రేటింగ్ అయితే 4 స్టార్ ఉంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 6,999 కాగా.. ఆఫర్ లో మీరు రూ. 2,495 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రాజెక్టర్ ని బయటకు తీసుకెళ్లినప్పుడు కనుక వీడియోలు ప్లే చేయడానికి ఓపెన్ ఏరియాలో కుదరదు కాబట్టి మీకు ప్రాజెక్టర్ స్క్రీన్ ఉండాలి. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 3,999 కాగా ఆఫర్ లో రూ. 1699కే అందుబాటులో ఉంది.