మహిళలకు అదిరిపోయే శుభవార్త.. మళ్లీ దిగివచ్చిన పసిడి ధర.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates in Hyderabad: ఇటీవల దేశంలో బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కానీ పసిడి కొనుగోలు ఎక్కడా తగ్గడం లేదు.

Gold and Silver Rates in Hyderabad: ఇటీవల దేశంలో బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కానీ పసిడి కొనుగోలు ఎక్కడా తగ్గడం లేదు.

బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అమూల్యమైన లోహం. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పసిడి అంటే మక్కువ చూపిస్తుంటారు. భారత దేశంలో ప్రతి పండుగ, పెళ్లిళ్ళు, శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. గత కొంత కాలంగా పసిడి, వెండి ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు సైతం పసిడి, వెండి ధరలపై పడుతుందని నిపుణులు అంటున్నారు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం కొనుగోలు చేయానుకునే మగువలకు అదిరిపోయే శుభవార్త. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు మూడు రోజులుగా వరుసగా తగ్గుతున్నాయి. గత మూడు సెషన్లలో పసిడి ధర పడిపోయింది. వెండి రేటు సైతం పడిపోతూ వస్తుంది. మన దేశంలో శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ప్రస్తుతం మేలిమి బంగారం రూ.73 వేలు దాటింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, రూ.66,690 గా పలుకుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, రూ.72, 760గా పలుకుతుంది. హైదరాబాద్, వరంగల్, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72, 760 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి పై రూ.100 తగ్గింది.

దేశంలోని ముఖ్యనగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,840 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,910 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,690 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,760 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,690 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,760 వద్ద కొనసాగుతుంది. వెండి విషయానికి వస్తే.. చెన్నై, కేరళా, హైదరాబాద్, విశాఖ, విజయవాలో కిలో వెండి ధర రూ. 91,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై లోకిలో వెండి ధర రూ.86,000 వద్ద కొనసాగుతుంది.

Show comments